అల్లుఅర్జున్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'డిజె' (దువ్వాడ జగన్నాథం). తాజాగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో బ్రాహ్మణ యువకునిగా, స్కూటర్‌పై కూరగాయలు తీసుకుంటూ వస్తున్న బన్నీ లుక్ అందరినీ బాగా ఆకర్షిస్తోంది. దీంతో ఈ చిత్రం ఎన్టీఆర్-వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అదుర్స్'కు సీక్వెల్‌గా ఉంటుందని కొందరు అంటుంటే...కాదు.. కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ముగ్గురుమొనగాళ్లు' తరహాలో ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కానీ తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. చిరంజీవిని హీరోగా నిలబెట్టిన చిత్రం 'ఇంట్లో రామయ్య.. వీదిలో కృష్ణయ్య'. మాధవి, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రానికి కోడిరామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆరోజుల్లో ఘనవిజయం సాధించి, చిరుని హీరోగా నిలబెట్టింది. తాజా సమాచారం ప్రకారం హరీష్‌శంకర్ ఇదే చిత్రం పాయింట్‌ని తీసుకుని, సరికొత్తగా ట్రీట్‌మెంట్ రాసుకొని, యాక్షన్, ఫ్యామిలీ జోనర్‌గా కామెడీగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
దీనికోసం హరీష్‌శంకర్ ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈ తరం ప్రేక్షకుల ట్రెండ్‌కు అనుగుణంగా దీనిని తెరకెక్కిస్తున్నారట. కేవలం 'అదుర్స్'లోని చారి పాత్రను మాత్రమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, తనదైన పంథాలో హరీష్‌శంకర్ చిత్రాన్ని తీస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం కూడా 'ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య' తరహాలో ఘనవిజయం సాధించి, బన్నీ రేంజ్‌ను మరింతగా పెంచుతుందా? లేదా? అనేది చూడాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేలో సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.