Advertisementt

పవన్‌ వల్ల ఎన్టీఆర్ కు ముప్పు..!

Tue 21st Feb 2017 10:05 PM
pawan kalyan,young tiger ntr,director trivikram srinivas,boby director  పవన్‌ వల్ల ఎన్టీఆర్ కు ముప్పు..!
పవన్‌ వల్ల ఎన్టీఆర్ కు ముప్పు..!
Advertisement
Ads by CJ

పవన్‌ కళ్యాణ్‌ వల్ల జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఏం ముప్పు అనుకోవాల్సిన పనిలేదు. నిజంగానే పవన్‌ వల్ల ఎన్టీఆర్‌ ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విషయానికి వస్తే పవన్‌ ప్రస్తుతం 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌తో పాటు రాజకీయాలలో కూడా బిజీ అయ్యాడు. దాంతో 'కాటమరాయుడు' చిత్రం ఆలస్యమవుతోంది. ఎట్టకేలకు ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ముందు అనుకున్న ప్రకారం త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో పవన్‌ చేయబోయే చిత్రం ఈ పాటికే షూటింగ్‌ మొదలుకావాల్సివుంది. కానీ ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్‌లో గానీ పట్టాలెక్కే అవకాశం లేదు. ఇక 'అ..ఆ' తర్వాత త్రివిక్రమ్‌ పవన్‌ సబ్జెక్ట్‌ కోసం దాదాపు ఏడునెలలుగా కుస్తీపడుతున్నాడు. కాబట్టి పవన్‌-త్రివిక్రమ్‌ల చిత్రం ఏప్రిల్‌లో మొదలవుతుందని సమాచారం. 

ఇక పవన్‌ ఉన్న బిజీలో ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇక సినిమా సినిమాకి సబ్జెక్ట్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ కోసం త్రివిక్రమ్‌ భారీ గ్యాప్‌ తీసుకొని, తనకు పూర్తిగా సంతృప్తి లభిస్తే గానీ షూటింగ్‌ మొదలుపెట్టడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బాబి చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ మొదలైనా కూడా ఎన్టీఆర్‌ ఇంకా షూటింగ్‌లో జాయిన్‌ కాలేదు. మరో వెరైటీ లుక్‌ కోసం ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదారునెలల్లో పూర్తి చేయాలని నందమూరి సోదరులు భావిస్తున్నారు. కాబట్టి ఈ మూవీ ఆగష్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేయబోయే చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభిస్తామని నిర్మాతలు అనౌన్స్‌ చేశారు. మరి ఆ సమయానికి పవన్‌-త్రివిక్రమ్‌ల చిత్రం షూటింగ్‌ పూర్తవుతుందా? పూర్తయినా మరలా త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌పై ఎంతకాలం కూర్చుంటాడు? అనేది ప్రశ్నార్దకంగా మారుతోంది. మరి ఆ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కోసం అంతకాలం వెయిట్‌ చేస్తాడా? ఈమధ్యలో మరో చిత్రం పూర్తి చేస్తాడా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ