Advertisementt

'విన్నర్‌'కి గట్టి పోటీ తప్పేలా లేదు..!

Thu 23rd Feb 2017 06:55 PM
winner,saidhram tej,mahashivaratri,yaman,vijay antony  'విన్నర్‌'కి గట్టి పోటీ తప్పేలా లేదు..!
'విన్నర్‌'కి గట్టి పోటీ తప్పేలా లేదు..!
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా, స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా, అనసూయ స్పెషల్‌ సాంగ్‌లో చేస్తున్న క్రేజీ చిత్రం 'విన్నర్‌'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం, జగపతిబాబు వంటి వారి నటన, నిర్మాతల ధైర్యం, తమన్‌ అందించిన సంగీతం వంటివి చిత్రానికి ప్లస్‌ కానున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24 విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఇంతకాలం తరచుగా మామ చిరంజీవి పాటలను రీమిక్స్‌ చేస్తోన్న సాయి ఇది కేవలం దర్శకులు, సంగీత దర్శకుల బలవంతం వల్లనే అని, తాను కావాలని చేసిందని కాదని చెప్పడం హర్షణీయం. మరోపక్క 'నకిలీ, డాక్టర్‌ సలీం, బిచ్చగాడు, భేతాళుడు' చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్‌ తెచ్చుకుంటున్న విజయ్‌ ఆంటోని నటిస్తోన్న 'యమన్‌' చిత్రం కూడా రేపే (ఫిబ్రవరి 24) విడుదల కానుంది. ఇప్పటికే 'బిచ్చగాడు'తో విజయ్‌ సంచలనం సృష్టించాడు. ఇక 'యమన్‌' చిత్రం ఓ పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టీజర్‌లోని డైలాగ్స్‌ ఆకట్టుకుని, ఆసక్తిని కలిగిస్తున్నాయి. నేడు ప్రేక్షకులు ఎవరు నటించారు? అనే విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటే ఆదరిస్తున్నారు. కాబట్టి 'యమన్‌' చిత్రాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. విజయ్‌ ఆంటోని అంటేనే వైవిధ్యానికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'విన్నర్‌'తో పాటు 'యమన్‌' కూడా భారీగానే విడుదలవుతోంది. ఇక 'విన్నర్‌' లానే 'యమన్‌' చిత్రాన్ని బాగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాశివరాత్రికి వీరిద్దరి మద్య గట్టిపోటీ తప్పకపోవచ్చని అనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ