ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ గురించి తెలియని వారుండరు. అయన తన నవలలో ఆయనేం అనుకున్నా దానిని మొహమాట పడకుండా రాస్తుంటారు. ఇక మాట్లాడే విషయంలో కూడా యండమూరి ఏదైనా సరే మొహం మీదే చెప్పేస్తారు. అలా ఆయన మనసులో ఏం అనుకున్నారో చెప్పేసి కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ మధ్యన ఏదో చర్చా కార్యక్రమంలో రామ్ చరణ్ కి దేవిశ్రీకి పోలిక పెట్టి రామ్ చరణ్ ని తక్కువ చేసి మాట్లాడాడు. ఇక ఆ మాటలకూ మెగా ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత మెగా కౌంటర్ ని నాగబాబు చేత ఇప్పించింది. ఇక ఆ కౌంటర్ కి వీరేంద్రనాధ్ కూడా నేనేదో అంటే అదివేరేలా అర్ధం చేసుకున్నారు మీరు అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక తాజాగా యండమూరి టీవీ షోస్ గురించి ఆయనేం అనుకుంటున్నారో... చెప్పి మళ్ళీ సంచలనం అయ్యారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడి షోపై రచయిత యండమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షోస్ కి ఒకొక్కరి వద్ద 15 రూపాయలు చొప్పున 10 లక్షల మంది వద్ద వసూలు చేసి దాంతో కోటి 50 లక్షలు సంపాదించి, అందులో ఆరులక్షలు రూపాయలను మనకు పడేస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. అసలు అలాంటి షోస్ లో పాల్గొనడం కన్నా ఏదో ఒక లాటరీ టికెట్ కొనుక్కోవడం బెటర్ అని అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేసారు.
మరి ఆయన అన్ని టీవీ షోస్ గురించి మాట్లాడితే.... అబ్బే అదేం లేదు కేవలం అయన చిరంజీవిని టార్గెట్ చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అంటున్నారు అప్పుడే కొంతమంది. ఆయనకి మెగా ఫ్యామిలీ అంటే జెలస్ కాబట్టే ఇలాంటి విపరీతమైన విమర్శలు చేస్తున్నారని, చిరంజీవిగారు మీలో ఎవరు కోటీశ్వరుడి షో కి వ్యాఖ్యాత గా వ్యవహరించడం ఆయనికి మింగుడు పడడంలేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ యండమూరిని టార్గెట్ చేశారు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.