Advertisementt

జక్కన్నోయ్..పోస్టర్ కేకన్నోయ్..!

Fri 24th Feb 2017 08:18 PM
ss rajamouli,jakkanna,bahubali 2,prabhas,mahashivaratri  జక్కన్నోయ్..పోస్టర్ కేకన్నోయ్..!
జక్కన్నోయ్..పోస్టర్ కేకన్నోయ్..!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి రెండవ భాగం. కాగా బాహుబలి చిత్రం మొదటి భాగం విశ్వవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.  బాహుబ‌లి- ది క‌న్‌క్లూజ‌న్‌ అన్న పేరుతో ఏప్రియల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమౌతుంది.  ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ వంటి భారీ తారాగణంతో పెద్ద ఎత్తున రూపొందిస్తున్న చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం విడుదలకు కాలం దగ్గర పడుతుండటంతో  అప్పుడే హడావుడి మొదలైంది. అయితే మహా శివరాత్రి సందర్భంగా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ లుక్‌ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దు విడుదల చేశాడు. భ‌ళి భ‌ళి భ‌లిరా .. సాహోరే బాహుబ‌లి.. అంటూ ఓ స్వ‌రం వినిపిస్తుండ‌గా.. భీక‌రాకారంలో గ‌జ‌రాజు నుదుటిమీద నుండి ఎగురుతూ వెళ్తున్న బాహుబ‌లి ఆకారంతో ఈ పోస్టర్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మదించిన ఏనుగులకే మతిపోయేలా, ఓ సరికొత్త వీరుడిలా.. పోస్టర్ లుక్ ఆవిష్కరించడం జరిగింది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ముందుగానే చెప్పినట్లు మొదటి భాగాన్ని మించి నాలుగు రెట్లు అధికంగా భీక‌రమైన పోరాటాలు, యాక్ష‌న్ ఎలిమెంట్స్ బాహుబలి రెండవభాగంలో ఉంటాయని జక్కన్న వివరించిన విషయం తెలిసిందే. అందుకు సింబాలిక్ గా ఈ పోస్ట‌ర్ ను జక్కన్న ఆవిష్క‌రించినట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ పోస్టర్ లో ఏనుగు, ప్రభాస్ వీరోచిత ఆకారం విమర్శకులను సైతం వేలెత్తి చూపకుండా ఉంచేలా రాజమౌళి పోస్టర్‌ని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అంటే మొదటి పోస్టర్ లో పొరపాటు చేసి విమర్శకులకు ఛాన్స్ ఇచ్చిన రాజమౌళి, మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన రెండవ పోస్టర్ లో అలాంటి  తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి. అయితే సినీ అభిమానులను మాత్రం.. ఏనుగుపై ఉంది శివయ్యా.. లేకా బాహుబలా అనే ప్రశ్న వేధిస్తూనే ఉంది.  ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  బాహుబలి ది కంక్లూజన్ చిత్రం గ్రాఫిక్ వర్క్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ