నాటి సుభాష్‌చంద్రబోస్ ఎలా మరణించాడు? లాల్‌బహదూర్‌శాస్త్రి మృతి వెనుక కారణాలు ఏమిటి? స్వర్గీయ ఎన్టీఆర్‌కు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి స్టెరాయిడ్స్ ఇచ్చి, ఆయన అనారోగ్యానికి కారణమైందనే ఆరోపణలకు సమాధానం ఎక్కడ? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ పేలి పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి సమాధానం ఉందా? జయలలిత విషయంలో అపోలో హాస్పిటల్ చెబుతున్న వంకలు, సాకులు నిజమేనా? తాజాగా వాజ్‌పేయ్ వంటి మహానుభాహుడికి మత్తుమందులు ఇచ్చి, మతిస్థిమితం లేకుండా, నేటి రాజకీయాలు కూడా అర్ధం కానంతగా మార్చారని లల్లూప్రసాద్‌యాదవ్ చేస్తున్న ఆరోపణలో నిజమెంత? పారదర్శకత గురించి మాట్లాడే మన నాయకులు ఆ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? వంటి వాటిని సమాధానాలు లేవు. మరి అంత గొప్ప గొప్ప వారి ఆర్యోగాలు, మరణాలపైనే అంత మిస్టరీ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? పుట్టపర్తి సాయిబాబా విషయాన్నే మన నేతలు, ఆయన శిష్యబృందాలు దాచిపెడుతున్నాయి. వీటిపై ఎవ్వరూ పెదవి విప్పరు. విమర్శలు చేసిన వారిపై ఎదురు దాడి చేస్తారు తప్ప ఎందుకు నిజానిజాలు బయటపెట్టి, తమ తప్పులేకపోతే నిజాలను బయటపెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రజలకు ఈ వాస్తవాలు తెలుసుకునే అవకాశం లేదా? ఈ విషయంలో సమాచార హక్కు చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్న మన నాయకులను, పాలకులను ఏమనాలి?
అసలు మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టడం వెనుక వాజ్‌పేయ్, అద్వానీల ఉద్దేశ్యం ఏమిటి? పార్టీకి మూలస్థంభాలైన వారి అభిప్రాయాలు ప్రజలకు తెలుసుకునే హక్కులేదా? కాన్షీరాంను మాయావతి నానా చిత్ర హింసలకు గురి చేసిందనే ఆరోపణ మాటేమిటి? మరి ఇవ్వన్నీ అడిగితే ఎదురుదాడి చేస్తారు? లేదా లల్లూ లాంటి అవినీతి పరులకు అలా ప్రశ్నించే హక్కే లేదంటారు? సామాన్యుల ప్రశ్నలకు ఎలాగూ సమాధానం చెప్పరు. మరి లల్లూ వంటి వారు చేసే ఆరోపణలపై కూడా స్పందించరా? స్వయాన జయ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా కూడా పట్టించుకోరా? లల్లూ అవినీతిపరుడే కావచ్చు. కానీ ఆయన లేవనెత్తిన వాజ్‌పేయ్ అంశం ఎందరి మదిలోనో ఉంది. దానిని లల్లూ బయటకు అడిగాడు. మరి లల్లూ అవినీతికి, వాజ్‌పేయ్ ఆరోగ్యపరిస్థితిపై వేసిన ప్రశ్నలకు లింకేమిటి? స్వయాన లల్లూ మిత్రపక్షమైన నితీష్‌కుమార్ కూడా నమ్మడు అనేది కరెక్ట్ సమాధానమేనా? నితీష్‌కు అనుమానాలు లేకపోవచ్చు. కానీ చాలా మందికి అనుమానాలున్నాయి. మరి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నాయకులకు, అధికారంలో ఉన్న వారికి లేదా? అన్నదే అసలు ప్రశ్న.