అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ పవన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ అప్పటి నుండి ఇప్పటివరకు ఇబ్బందుల పాలు అవుతూనే ఉన్నాడు. ఆ మధ్యన 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ వేదిక దగ్గరికి వచ్చేటప్పుడు పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని చుట్టుముట్టి గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న 'డీజే దువ్వాడ జగన్నాథం'చిత్ర టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇంకా ఆ చిత్ర టీజర్ కి ఎన్ని లైక్స్ వస్తాయో అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఆ టీజర్ కి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ డిజ్ లైక్స్ ఇచ్చి షాక్ కి గురి చేశారు. ఇక టీజర్ విడుదల చేసినప్పటి నుండి లైక్స్, డిజ్ లైక్స్ తో యూట్యూబ్ ని పవన్ ఫ్యాన్స్ అల్లాడించారని అంటున్నారు.
ఒకే ఒక గంటలో 10 వేల డిజ్ లైక్స్ తో రికార్డు నెలకొల్పారు. అలా వరుసగా గంట గంట కి ఈ డిజ్ లైక్స్ మోత మోగిస్తూ అల్లు అర్జున్ మీద వున్న తమ కసిని పవన్ ఫ్యాన్స్ ఈ విధం తీర్చుకున్నారని అందరూ కామెంట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఏ హీరోల చిత్ర టీజర్స్ కి ఇలా ఇంతటి డిజ్ లైక్స్ రాలేదని చెబుతున్నారు. మరి ఈ డిజ్ లైక్స్ వ్యవహారం వెనుక నిజంగానే పవన్ ఫ్యాన్స్ వున్నారా? లేక కావాలనే ఎవరన్నా ఇలా చేసి పవన్ ఫ్యాన్స్ మీద నెట్టేసున్నారా? అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో సఫర్ అవుతున్నాడని అంటున్నారు.