ఈ మధ్య ఎమ్మెల్యే రోజా ప్రవర్తన, మాటల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా బిహేవ్ చేయడం పలు చర్చలకు దారితీస్తోంది, నిండు అసెంబ్లీలో ఆమె ప్రవర్తించిన తీరే కాకుండా, ఇటీవల జరిగిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు లోక్‌సభ స్పీకర్, ఇతర దేశాల మహిళా ప్రతినిధులు, దలైలామా వంటి పూజనీయులు హాజరయ్యారు. ఈ సదస్సును ఆమె కిట్టీ పార్టీగా అభివర్ణించింది. ఇక తాజాగా ఆమె తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంది. ఇటీవల తిరుమలలో మీడియాతో ఎవ్వరూ పొలిటికల్ స్పీచ్‌లు ఇవ్వరాదనే నిబంధన విధించారు.
కానీ రోజా దానిని అతిక్రమించి మీడియావారితో రాజకీయాలు మాట్లాడబోయింది. దీన్ని గమనించిన పక్కనే ఉన్న ఓ టిటిడి అధికారి ఆమెకు నచ్చజెప్పి, రాజకీయాలు మాట్లాడవద్దని సర్దిచెప్పాడు. కానీ ఆమె మరికొంత దూరం పోయిన తర్వాత మరలా మీడియాతో పొలిటికల్ విషయాలను మాట్లాడింది. ఏపీ పోలీస్‌లను ఆమె అవమానించిదని ఫీలయిన ఆ అసోసియేషన్ ఇటీవల రోజా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. దీన్ని ఆమె తిరుమలలో కూడా మరలా కెలిక్కింది.
తనను క్షమాపణ కోరేముందు పోలీసులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించడంతో పాటు మరికొన్ని విషయాలపై కూడా ప్రభుత్వాన్ని ఆమె తిరుమలలో విమర్శించింది. దీంతో పలు విమర్శలు మొదలయ్యాయి. ఇక గతంలో కూడా వైయస్ జగన్ తిరుమలలో ప్రవర్తించిన తీరు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా బతికున్నప్పుడు వేంకటేశ్వరస్వామిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీని మెజార్టీ హిందువులు అనుమానంతో చూసే పరిస్థితులు తలెత్తుతున్నాయి.