Advertisementt

మళ్లీ ఇద్దరు ఒకటైతే నాగ్ సంతోషిస్తాడు..!

Sun 26th Feb 2017 06:07 PM
akkineni family,nagarjuna,akhil,shriya bhupal,marriage rejected,naga chaitanya,samantha  మళ్లీ ఇద్దరు ఒకటైతే నాగ్ సంతోషిస్తాడు..!
మళ్లీ ఇద్దరు ఒకటైతే నాగ్ సంతోషిస్తాడు..!
Advertisement
Ads by CJ

అఖిల్ - శ్రీయ భూపాల్ పెళ్లి రద్దయిందనే వార్త  ఇప్పుడు టాలీవుడ్ ని ఒక కుదుపు కుదుపుతున్న వార్త. అసలేం జరిగింది. అఖిల్, శ్రీయ ఎందుకు విడిపోయారు? వీరు విడిపోతుంటే జివికె ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఏం చేస్తుంది? అసలు ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎందుకు స్పందించడంలేదు? నాగ్ ఎందుకు నోరు విప్పడం లేదు? ఇలా ఎన్నో రకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మెదులుతున్నాయి. మరి నాగార్జున ఇంతవరకు ఈ పెళ్లి గురించి ఎందుకు నోరు విప్పడం లేదు. అసలు ఈ వార్తలు నిజామా లేక పుకారా? అనే ప్రశ్నలతో ప్రతి ఒక్కరూ బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

మరి మీడియాలో ఇంత జరుగుతున్నా నాగ్ ఎందుకు స్పందించడం లేదో కూడా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అవేమిటంటే అఖిల్ - శ్రీయలు ఇద్దరు చిన్న చిన్న మనస్పర్థలు వల్ల విడియారు. అందుకే పెళ్లిని రద్దు చేసుకున్నారు కానీ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చెయ్యక పోవడం వల్ల వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని ఇరు కుటుంబాలు ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇక నాగ్ ఏదైనా బిజినెస్ మైండ్ తో సూపర్ ఆలోచనలతో ఉంటాడనే పేరుంది. అదే సూపర్ మైండ్ తో అఖిల్ -శ్రీయ భూపాల్ మళ్లీ కలుస్తారనే అంచనాతో నాగ్ ఉండడం వల్లే ఇంకా మీడియాకి ఈ పెళ్లి రద్దయిన విషయాన్ని చెప్పలేదని అంటున్నారు.

మరి నిజంగా అఖిల్ - శ్రీయ భూపాల్ మధ్య విభేదాలు తొలిగిపోయి మళ్లీ ఒక్కటైతే నాగ్ కన్నా ఎక్కువగా సంతోషించేవాళ్ళు ఉండరేమో?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ