Advertisementt

చిరు స్థానాన్ని బాలీవుడ్‌లో ఎవరు భర్తీ చేస్తున్నారు..!

Mon 27th Feb 2017 12:48 PM
director muragaadas,mahesh babu,chiranjeevi,hrithik roshan,bollyood,khaidi no 150 remake in bollywood  చిరు స్థానాన్ని బాలీవుడ్‌లో ఎవరు భర్తీ చేస్తున్నారు..!
చిరు స్థానాన్ని బాలీవుడ్‌లో ఎవరు భర్తీ చేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ 'రమణ'ని తెలుగులో చిరంజీవి 'ఠాగూర్‌'గా రీమేక్‌ చేశాడు. ఇదే చిత్రాన్ని ఇటీవలే క్రిష్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌ హీరోగా 'గబ్బర్‌' పేరుతో రీమేక్‌ చేశారు. ఇక బాలీవుడ్‌కి కూడా మురుగదాస్‌కి మంచి అనుబంధం ఉంది. ఆయనంటూ అక్కడ ఓ క్రేజ్‌ ఉంది. 'గజిని'తో పాటు 'తుపాకి'ని కూడా మురుగదాస్‌ బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేసి విజయం సాధించాడు. ఇక ఇటీవల మురుగదాస్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం 'కత్తి'ని చిరు తన 150వ చిత్రంగా వినాయక్‌తో రీమేక్‌ చేసి ఘన విజయం సాధించాడు. 

దీంతో ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కూడా సూపర్‌క్రేజ్‌ వచ్చింది. ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి స్టార్స్‌ ఆసక్తి చూపించారు. సల్మాన్‌ హీరోగా ఈ చిత్రాన్ని తీయడానికి మురుగదాస్‌తో చర్చలు కూడా నడిచాయి. కానీ సల్మాన్‌తో ఈ చిత్రం ఓకే కాలేదు. ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ప్రస్తుతం అక్షయ్‌ వరుస చిత్రాలను ఒప్పుకొని బిజీ బిజీగా ఉండటంతో ఆయనకు చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నాడు. దీంతో ఈ అవకాశం గ్రీకువీరుడు హృతిక్‌రోషన్‌కు వరించిందని తాజా సమాచారం. 

చర్చలు కూడా ముగిశాయట. ఈ చిత్రానికి హిందీలో కూడా మురుగదాసే దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. కాగా ప్రస్తుతం మురుగదాస్‌ మహేష్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ వెంటనే విజయ్‌తో హ్యాట్రిక్‌మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో మురుగదాస్‌ హృతిక్‌రోషన్‌తో చేయబోయే 'కత్తి' బాలీవుడ్‌ రీమేక్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది? అనే విషయంపై కన్‌ఫ్యూజన్‌ నెలకొనివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ