నితిన్, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందుకే తన సినిమాల ఫంక్షన్స్ కి రావడానికి కి, కొన్ని సన్నివేశాల్లో పవన్ సినిమాల సీన్స్ వాడడానికి పవన్ ని పర్మిషన్ అడుగుతుంటాడు. ఇక అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. అసలు నితిన్, పవన్ జపం మొదలుపెట్టేకే హిట్ ట్రాక్ ఎక్కేడని నితిన్ గురించి తెలిసినవారంతా చెబుతారు. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కూడా నితిన్ సినిమాని సమర్పించేస్తున్నాడు కూడా. నితిన్ హీరోగా త్రివిక్రమ్ నిర్మించబోయే చిత్రానికి పవన్ కళ్యాణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇకపోతే నితిన్ ఒక పక్కన షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే మరోపక్క పవన్ కళ్యాణ్ ని కాటమరాయుడు సెట్స్ లో కలిసాడు. ఆ కలిసినప్పుడు అక్కడే వున్న ఆలీ, శివ బాలాజీ, చైతన్య కృష్ణ,అజయ్,సాందీప్ లతో ఒక ఫోటో కూడా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక పవన్ తోపాటే ఆలీ వాళ్ళు కూడా పంచెకట్టులో మెరిసిపోతున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ యాక్షన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఫ్యాక్షన్ అంటే కత్తులు, గొడ్డళ్లు.... అప్పుడప్పుడు ఇలా పంచె కట్టులు ఉంటాయిగా మరి. అందుకే పవన్ ఇలా పంచె కట్టుకుని తన తమ్ముళ్ళతో తన వీరభిమానితో ఒక చక్కటి ఫోటో కి ఫోజ్ ఇచ్చాడు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.