Advertisementt

అబ్బా.. ఆయన భలే చిలిపి..!

Wed 01st Mar 2017 12:57 PM
shahrukh khan,yash chopra award,rekha,jayapradha  అబ్బా.. ఆయన భలే చిలిపి..!
అబ్బా.. ఆయన భలే చిలిపి..!
Advertisement
Ads by CJ

తెరమీదనే కాదు.. తెర ముందు కూడా కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌ అంటే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖానే అని ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎన్నో యాక్షన్‌ చిత్రాలలో నటించినా కూడా రొమాంటిక్‌ కింగ్‌ అనే పేరు మాత్రం అలానే ఉంది. ఇక ఆయన మంచి నటుడే కాదు... సమయస్ఫూర్తిగా మాట్లాడటంలోనూ, వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈయన బాలీవుడ్‌ బాద్‌షాగా మారే క్రమంలో, ఆయన నేడున్న స్థితికి యష్‌చోప్రా ముఖ్యకారణం అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. తాజాగా షార్‌ఖ్‌.. యష్‌ చోప్రా నేషనల్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ వేడుకకు సీనియర్‌ అందగత్తెలైన రేఖ, జయప్రద కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుఖ్‌కి బంగారు కడియాన్ని రేఖ తొడిగారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యతకు తావులేకుండానే పలు చిలిపి వ్యాఖ్యలు చేసి తన స్పాంటేనియస్‌నెస్‌ని చాటాడు. అందాల దేవతైన రేఖ చేత ఎవరైనా రాఖీ కట్టించుకుంటారా? అది నా దురదృష్టం అని వ్యాఖ్యానించాడు. ఈ చమక్కుకు వేడుకలో నవ్వులు పూశాయి. ఇక ఆయన జయప్రదను కూడా వదలలేదు. నా యవ్వనమంతా జయప్రద అందాలను చూస్తూనే గడిపానని, కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఇప్పటివరకు తనకు అవకాశం రాలేదన్నాడు. ఈ వేడుకలో ఆ విషయం చెప్పాలంటే గవర్నర్‌ సార్‌ కూడా ఇక్కడే ఉన్నాడని అంటూనే తన మనసులోని మాటను బయటికి చెప్పేసి ఘటికుడనిపించుకుని తన వాక్చతుర్యంతో ఆ వేడుకకే ఆయన ప్రసంగం హైలెట్‌గా నిలిపి.. ఔరా.. అనిపించాడు. దీంతో ఆయన అభిమానులందరూ దటీజ్‌ .. కింగ్‌ఖాన్‌ అండ్‌ బాద్‌షా అంటూ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ