Advertisementt

విజయ్ దేవరకొండ అస్సలు తగ్గట్లేదుగా...!

Wed 01st Mar 2017 04:25 PM
vijay devarakonda,dwaraka movie,lip locks,arjun reddy movie,dwaraka story,content  విజయ్ దేవరకొండ అస్సలు తగ్గట్లేదుగా...!
విజయ్ దేవరకొండ అస్సలు తగ్గట్లేదుగా...!
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ను చూసిన కుర్రకారు మంచి మూడ్ ను పట్టేసుకున్నారు. విజయ్ దేవరకొండ, హీరోయిన్ తో కలిసి చేసిన లిప్ లాక్ సన్నివేశాలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దాదాపు ఇలాంటివే 14 వరకు లిప్ లాకులున్నాయని అంటున్నారు సినీజనాలు. అయితే అర్జున్ రెడ్డి చిత్రంలోనే ఇన్ని లిప్ లాకులు ఉంటే... తాజాగా విడుదలయ్యే ‘ద్వారక’ చిత్రంలో ఇంకెన్ని లిప్ లాకులుంటాయని అడిగితే వెంటనే విజయ్ దేవరకొండ ఇందులో కూడా రెండున్నాయని టకీమని సమాధానం చెప్పేశాడు. దీన్ని బట్టి చూస్తే... విజయ్ దేవరకొండ ఈ లిప్ లాక్ విషయంలో అస్సలు తగ్గట్లేదుగా అనిపిస్తుంది. 

కాగా ద్వారకా చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇలా మీరు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో అలా లిప్ లాక్ లు చేసేస్తున్నారు.. అందుకోసం ప్రధానంగా రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారా? అని అడుగగా.. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం వంటివేం చేయడం లేదని.. కథ, ఆ సిచ్యుయేషన్  చేసే డిమాండ్ ను బట్టే అవి ఉంటున్నాయి తప్ప , రెమ్యునరేషన్ కు, లిప్ లాక్ లకు అస్సలు సంబంధమే లేదని విజయ్ వివరించాడు. 

విజయ్ దేవర కొండ ఇంకా మాట్లాడుతూ..  ‘ద్వారక’ చిత్రంలో తాను ఓ దొంగ బాబాగా నటించానని, ఈ చిత్రంలో అలా దొంగ బాబా అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటనేది, అలా ఎందుకు మారాను అనేదే చాలా ఆసక్తి రేపే అంశంగా ఆయన తెలిపాడు. నిజంగా ఈ అంశాలన్నీ స్క్రీన్ పై చూస్తేనే బాగుంటుందని ఆయన తెలిపాడు. కాగా ఈ చిత్రం మంచి కంటెంటు ఉన్న సినిమాగా విజయ్ దేవరకొండ అభివర్ణించాడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ