Advertisementt

రాజ్ తరుణ్ అసలు విషయం చెప్పేశాడు..!

Fri 03rd Mar 2017 02:18 PM
raj tarun,shatamanam bhavathi,nenu local  రాజ్ తరుణ్ అసలు విషయం చెప్పేశాడు..!
రాజ్ తరుణ్ అసలు విషయం చెప్పేశాడు..!
Advertisement
Ads by CJ

దర్శకుడిని కావాలని కలలు కని, అనుకోకుండా 'ఉయ్యాల... జంపాల' చిత్రంతో హీరోగా మారాడు రాజ్‌తరుణ్‌. కాగా అయనకు వరస హిట్స్‌ వస్తూ, మినిమం గ్యారంటీ నటునిగా పేరు తెచ్చుకుంటున్నాడు. వరుస విజయాల సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంలో రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో వరుసగా రెండు చిత్రాలు చేస్తున్నాడు. అవి 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంధగాడు'. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'కు 'దొంగాట' ఫేమ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, 'అంధగాడు' చిత్రానికి రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 'అంధగాడు'లో అంధునిగా నటిస్తున్న ఆయన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో వెరైటీగా కుక్కల కిడ్నాపర్‌ పాత్రను చేస్తున్నాడు. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం మార్చి3వ తేదీన విడుదల కానుంది. 

ఇక ఈమధ్య రాజ్‌తరుణ్‌.... దిల్‌రాజు బేనర్‌లో వచ్చిన 'శతమానం భవతి', 'నేను..లోకల్‌' చిత్రాలలో అవకాశం వచ్చినా రిజెక్ట్‌ చేశాడనే ప్రచారం విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిపై రాజ్‌తరుణ్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, 'శతమానం భవతి' చిత్రం కథ మొదట నా వద్దకే వచ్చింది. కానీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నందున ఎక్కువ డేట్స్‌ను వెంటనే అడిగారు. కానీ నేను అప్పటికే మూడు చిత్రాలు చేస్తున్నాను. దాంతో నేను ఆ చిత్రం చేయలేకపోయాను. ఇక 'నేను లోకల్‌' కథను దర్శకనిర్మాతలు ముందుగా నాకే చెప్పారు. కానీ దిల్‌రాజు గారు ఈ కథకు నేను కాకుండా నాని అయితే బాగుంటుందని భావించారు. దాంతో నేనే సైడ్‌ అయిపోయాను... అని అసలు విషయాలను ఓపెన్‌ చేసి రూమర్లకు చెక్‌పెట్టాడు. దిల్‌రాజు గారి బేనర్‌లో చేయాలని ఎవరికి మాత్రం ఉండడు? నేను అలాంటి అవకాశం వస్తే ఎందుకు మిస్‌ చేసుకుంటాను? త్వరలోనే దిల్‌రాజు గారి బేనర్‌లో ఓ చిత్రం చేయనున్నాను... అని తెలిపాడు. కాస్త లేటుగా స్పందించినా కూడా ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన రాజ్‌తరుణ్‌ మంచి పనిచేశాడనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ