Advertisementt

సౌత్ ఫిల్మ్ పై రహస్యం చెప్పిన కరీనా.!

Fri 03rd Mar 2017 06:33 PM
kareena kapoor,bollywood movies,south movies,language problem,kareena  సౌత్ ఫిల్మ్ పై రహస్యం చెప్పిన కరీనా.!
సౌత్ ఫిల్మ్ పై రహస్యం చెప్పిన కరీనా.!
Advertisement
Ads by CJ

సౌత్ ఇండియన్స్ సహజంగా చాలా వరకు కథా నాయికలను ముంబై నుండే దిగుమతి చేసుకుంటుంటారు. సహజంగా బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న వారినైతే అస్సలు విడిచిపెట్టరనుకో. అలాగని కొత్త నాయికలను పరిచయం చేయడంలోనూ ముందుంటుంది సౌత్ సినీ పరిశ్రమ. అలా ఐశ్వర్యారాయ్,  కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్, శిల్పా శెట్టి, దీపికా పదుకొనే వంటి అగ్రశ్రేణిలో దూసుకుపోయిన బాలీవుడ్ నటీమణులందరితోనూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ మూవీస్ చేశారు. ఒక్క కరీనా కపూర్ తో తప్ప. కరీనా కపూర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న కాలంలోనే మన దర్శక నిర్మాతలు కరీనా కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేశారంట. అయితే ఆమె మాత్రం వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పిందనుకుంటున్నారా? అదేం లేదు. ఆమె ఎందుకు సౌత్ ఇండియన్ సినిమాలో నటించలేదో అసలు రహస్యాన్ని చాలా కాలానికి చెప్పేసింది కరీనా కపూర్.

కరీనా తాజాగా ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ... తాను సౌత్ ఇండియన్ సినిమాలో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడానికి కారణం ఆయా భాషలకు తాను కనెక్టు కాలేనని భావించి దక్షిణాది సినిమాలో నటించేందుకు తనకు ఎన్నో అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్లుగా వెల్లడించింది కరీనా కపూర్. అదేవిధంగా ఇక భవిష్యత్తులో కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ లో నటించే అవకాశం లేనట్టుగానే వివరించింది కరీనా. విషయం చెప్పాలంటే సౌత్ ఇండియన్ సినిమాలంటే తనకు చాలా గౌరవం ఉందని, అక్కడ నటించనంత మాత్రాన వాటిపట్ల తనకు ఏమాత్రం చిన్నచూపు లేదని ఆమె తెలిపింది. ఇంకా కరీనా మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ మూవీ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, అక్కడ చాలా మంది గొప్ప గొప్ప నటీనటులున్నారని, అంతేకాకుండా చాలా గొప్ప సినిమాలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చిందీ అమ్మడు. కేవలం తనకు ఆయా భాషలు రావు కాబట్టే అక్కడ సినిమాలు చేయలేదని, అంతే తప్ప మరో కారణమేం లేదని కరీనా వెల్లడించింది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ