Advertisementt

నమ్రతాశిరోద్కర్‌ క్లారిటీ..హర్షణీయం..!

Sat 04th Mar 2017 06:18 PM
namrata shirodkar,cine re entry,mahesh babu,namrata on re entry  నమ్రతాశిరోద్కర్‌ క్లారిటీ..హర్షణీయం..!
నమ్రతాశిరోద్కర్‌ క్లారిటీ..హర్షణీయం..!
Advertisement
Ads by CJ

మాజీ మిస్‌ ఇండియా అయిన నమ్రతాశిరోద్కర్‌ ఆ తర్వాత పలు బాలీవుడ్‌ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇక టాలీవుడ్‌లోకి కూడా ఎంటరై సూపర్‌స్టార్‌ మహేష్‌ని పెళ్లి చేసుకుంది. కాగా ఇటీవల నమ్రతా మరలా రీఎంట్రీ ఇస్తోందని, ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో ఆమె నటించబోతోందని వార్తలు హల్‌చల్‌చేస్తున్నాయి. దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌తోపాటు నమ్రతా అభిమానులు కూడా ఆనందపడ్డారు. ఇక మహేష్‌ ప్రస్తుతం మురుగదాస్‌ చిత్రంలో చేస్తున్నాడు.ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌. అయితే ఈ చిత్రంలో ఓ 10 నుంచి 15 నిమిషాల కోసం ఓ సీనియర్‌ హీరోయిన్‌ అవసరమని, ఆ పాత్రను నమ్రతా చేయనుందని, ఆమెతో పాటు మహేష్‌ కూడా దానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారనే ప్రచారం ఎక్కువైంది. కానీ ఇవ్వన్నీ కేవలం ఒట్టి పుకార్లేనని నమ్రతా తేల్చిచెప్పింది. 

తాను మిస్‌ ఇండియాగా.. ఆ తర్వాత పలు ఎంటర్‌టైనర్‌ చిత్రాలలో నటించిన విషయం అందరికీ తెలిసిందేనని.. కానీ ఇప్పుడు మరలా నటిగా రీఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో మహేష్‌, నమ్రతా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినా.. మొత్తానికి విషయాన్ని ఖండించి అలాంటి పుకార్లను తెరదించడం హర్షణీయం. తాను ప్రస్తుతం మహేష్‌ ఎండార్స్‌మెంట్‌ పనులు, ఆయన చిత్రాల ప్రమోషన్స్‌, ఇతర విషయాలలో, వ్యాపార విషయాలలో బిజీగా ఉన్నానని తెలిపింది. ఇక భార్యగా, పిల్లలకు తల్లిగా కూడా క్షణం తీరికలేకుండా ఉన్నానని, ఎప్పుడైనా గ్యాప్‌ దొరికితే ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తున్నానని, కాబట్టి తనకు రీఎంట్రీ ఇచ్చేంత టైం కూడా లేదని తేల్చేసింది. మరోపక్క ఆమె మహేష్‌ దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ది పనులను కూడా తానే స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇలాంటి సమయంలో తాను రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ