రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ అధికారికంగా మొదలైపోయింది. ఇక సెట్స్ మీదకెళ్లడమే తరువాయి. ఈ చిత్రంలో చరణ్ పక్కా పల్లెటూరి యువకుడిలా కనిపిస్తాడని... ఇది ఒక చక్కటి పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ముందుగా రామ్ చరణ్ కి జోడిగా రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లను అనుకున్నప్పటికీ వారిని కాదని సమంత కి ఛాన్స్ ఇచ్చారు సుకుమార్, చరణ్ లు. ఇక సమంత కూడా టాలీవుడ్ లో చేతిలో ఏ ప్రాజెక్ట్స్ లేక వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పేసుకుంది. ఇక ఈ నెల లో షూటింగ్ మొదలైపోయి చరణ్, సమంతలు ఇద్దరు షూట్ లో పాల్గొంటారని అనుకుంటున్న సమయంలో సమంత.. చరణ్, సుకుమార్ లకి షాక్ ఇచ్చినట్లు సమాచారం.
సమంత, రామ్ చరణ్ న్యూ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఏ కారణం లేకుండా సమంత అలా చెయ్యలేదని... అఖిల్ పెళ్లి రద్దుకావడంతో సమంత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని చెబుతున్నారు. అదేమిటి అఖిల్ పెళ్లి రద్దయితే సమంత కొత్త చిత్రాన్ని వదులుకోవడం ఏమిటా అనుకుంటున్నారా... అదేనండి సమంత అక్కినేని వారింటికి కోడలిగా వెళుతుంది కాబట్టి తన మరిది అఖిల్ కి శ్రియ భూపాల్ మధ్యన బ్రేకప్ కారణంగా అఖిల్ పెళ్లి రద్దవడంతో ఇప్పుడు సమంత పెళ్లి ప్రీ పోన్ అయినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో సమంత టాలీవుడ్ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంటుందని చెబుతున్నారు. ఎలాగూ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సమయం తీసుకున్న సమంతకి అఖిల్ వ్యవహారంతో పెళ్లి ని వాయిదా వేయలేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
ఇక నాగార్జున కూడా అఖిల్ పెళ్లి విషయంలో అప్సెట్ అవడం వలన నాగ చైతన్య ని సమంతని త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చెయ్యడం తో సమంత కూడా దానికి ఒప్పుకుని తాను ఒప్పుకున్న సినిమాల నుండి బయటికి వచ్చేస్తుందట. ఇకపోతే పెళ్లి అయిన వెంటనే అలా షూటింగ్స్ కి వెళ్ళిపోతే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేమని.... పెళ్లి తర్వాత కొద్దీ గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలు చెయ్యాలనే ఆలోచనతోనే సమంత ఇలా రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. మరి హీరోయిన్ కోసమే రామ్ చరణ్ కొత్త చిత్రం ఇంతవరకు లేట్ అవుతూ వచ్చింది. ఇక సమంతని ఫైనల్ అనుకున్నాక... సమంత ఇలా హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ హీరోయిన్ కోసం ఎంత టైమ్ పడుతుందో అని సుకుమార్, చరణ్ లు మధనపడుతున్నారట. అయితే సమంత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.