ఇప్పుడు సూచి లీక్స్ తమిళ ఇండస్ట్రీనే కాక తెలుగు ఇండస్ట్రీ ని తాకింది. ఒకప్పుడు నల్లధన కుబేరుల గుండెల్లో పనామా లీక్స్ ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో... ఇప్పుడు కోలీవుడ్ ని సుచి లీక్స్ అంతటి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ సుచి లీక్స్ ఏమిటా అనుకుంటున్నారా ? గత కొన్ని రోజుల నుండి సింగర్ సుచిత్ర తనని ధనుష్ చిత్ర బృందం వేధించిందని... ఈ విషయంలో హీరో ధనుష్ కూడా తనకి సపోర్ట్ చెయ్యలేదని ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయింది. ఇక తనని ఎలా వేధించారో కూడా కొన్ని ఫోటో లు తీసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోస్ లో తన ముఖాన్ని మాత్రం దాచేసి చేతులని మాత్రమే హైలెట్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సుచిత్ర భర్త కార్తీక్ లైన్ లోకొచ్చి తన భార్య అటువంటి ట్వీట్స్ ఏం చెయ్యలేదని... తన భార్య ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని సోషల్ మీడియాలో స్పందించాడు. మరి ఆ హీరో ఫ్యాన్స్ నుండి సుచిత్రకి బెదిరింపులు రావడం మూలంగానే సుచిత్ర భర్త అలా ఆమె ఏమి చెయ్యలేదని చెప్పాడా? అనే అనుమానం మొదలైంది. అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను ధనుష్ అంతటి హీరో మీద నింద మోపేంతటి గొప్పదానివా అంటూ ఆమెను నానారకాల ఇబ్బందులకు గురిచేస్తూ రచ్చ చేస్తున్నారు.
ఇక ఆ రచ్చ ముగియకముందే సుచిత్ర మళ్ళీ ధనుష్ పర్సనల్ ఆల్బమ్ తోపాటు ఇంకొందరి తమిళ హీరోల బండారం బయటపెట్టింది. ఇక ధనుష్, త్రిషతో క్లోజ్ గా వున్న ఫొటోస్ తో పాటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసి పడేసింది. అనిరుధ్ తమిళ హీరోయిన్ ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా సింగర్ సుచిత్ర, శింబు, హన్సిక రొమాన్స్ ఫొటోలతో పాటు పనిలోపనిగా టాలీవుడ్ హీరో రానా మీద కూడా తన ప్రతీకారం తీర్చుకుంది. రానా ఒక పార్టీలో హీరోయిన్ త్రిషని గట్టిగా హాగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో పోస్ట్ చేసి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది.
అసలు ఇంతకుముందే రానా కి త్రిష కి ఎఫ్ఫైర్ ఉందని మీడియా కోడై కూసింది. కానీ అది నిజమని ఎక్కడా రుజువు కాలేదు. కానీ ఇప్పుడు సుచి లీక్స్ అది నిజమని నమ్మేలా చేసింది. మరి ఒక్క ధనుష్ మీద ఉన్న పగతో సుచిత్ర ఆయన రిలేటివ్ అనిరుధ్ తో పాటే శింబు, రానాల పరువు కూడా తీసిపారేసింది. అసలు సుచిత్రే ఈ పర్సనల్ ఫొటోస్ ని లీక్ చేసిందా? లేక ఇంకెవరన్నా ఇలా చేస్తున్నారా అని అందరూ అనుకుంటున్నారు. ధనుష్ ఫ్యాన్స్ చేసిన పనికి సుచిత్ర ఇలా పగ తీర్చుకుందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరోపక్క ఈ లీక్స్ ని ఆపాలని కోలీవుడ్, టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగినట్టు వార్తలొస్తున్నాయి.