పరిశ్రమలో ప్రతిసారి హీరోలతో ఏం ఇబ్బంది కలగడం లేదు గానీ, హీరోల అభిమానులతోనే చాలా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అవి ఎంతవరకంటే గతంలో మరణాలకు కూడా దారి తీసిన సందర్భాలను మనం చూశాం. అయితే మన హీరోల వీరాభిమానులు వారి వారి హీరోలపై ఏమాత్రం మాట పడనీయకుండా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అలా ఎవరన్నా నోరు జారితే వారు ఎంతటి వారైనా సరే జన్మతః వారి చరిత్ర పరిణామ క్రమాన్ని గుర్తు చేస్తూ వారిది చదువుకొని వారికే దిమ్మతిరిగేలా చేస్తుంటారు ఆ అభిమానులు. స్టార్ హీరోల వీరాభిమానులతో వచ్చిన తంటాలు ఇవన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు.. అల్లు అర్జున్ మీద చూపిస్తున్న వ్యతిరేకత వీర ప్రతాపాలు ఇలాంటివే మరి. అప్పట్లో అల్లు అర్జున్.. ఏదో మూడులో ఉండి చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్లపై తను వివరణ ఇచ్చినా కూడా ఇంకా.. మెగా వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అది ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ను ఇబ్బందిపెడుతున్నా... అవి తనే స్వయంగా చెప్పినా గానీ విడిచిపెట్టడం లేదు సరికదా... ఇంకా మెగా వేడుకల్లో పవన్ అభిమానులు వీరలెవల్లో అల్లరి చేస్తూనే ఉన్న వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా వారి పట్ల వ్యతిరేకతతో ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు ఎలా డిజ్ లైక్స్ కొట్టారో చూశాం.
‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కు పెద్ద ఎత్తున డిజ్ లైక్స్ రావడంతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్త ఫీలయినట్లుగా ఉంది. పవన్ కు హరీశ శంకర్ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను పక్కన పెట్ట మరీ పవన్ తన సినిమాపై ఇలాంటి డిజ్ లైక్స్ కొట్టడం పట్ల కోపానికి గురైనట్లుగా తెలుస్తుంది. దాంతో... హరీశ్ శంకర్ తీవ్రమైన కోపానికి గురౌతూ... శ్రీ శ్రీ కవితను కోట్ చేశాడు. ఈ విషయంతో తన టీజర్ ను వ్యతిరేకించిన అభిమానులను హరీశ్ పరోక్షంగా చురకలంటించినట్లు తెలుస్తుంది. దీనిపై పవన్ అభిమానులు ఇంకా ఆగ్రహించారు. హరీష్ పై ఉన్నసదభిప్రాయం వారిలో పోయింది. ఇంక తిట్ల దండకం మొదలెట్టారు. పవన్ అభిమానులను ఇలా కట్టడి చేయడం కష్టమనుకున్న హరీష్ ఎలాగైనా వారితో సఖ్యతగా ఉండటానికే ప్రయత్నించాడు. దాంతో ‘కాటమరాయుడు’ టీజర్ పై ఒక పాజిటివ్ ట్వీట్ ను పెట్టాడు. 'మిర్రా మిర్రా మీసం' పాటపై హరీష్ స్పందిస్తూ... ఇక రికార్డులన్నీ పవన్ వశం కాబోతున్నాయ్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు కాస్త శాంతించినట్లుగా తెలుస్తుంది. అల్లా హరీష్ శంకర్ పవన్ అభిమానులతో తెగేదాకా లాగకుండా మొదట్లోనే శత్రుత్వానికి తెరదించినట్లయింది.