సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. రేణు దేశాయ్ ప్రతి యేడాది మహిళా దినోత్సవానికి ఏదో ఒక చానల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సారి కూడా రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది రేణు. కాగా ఈ ఇంటర్వ్యూ సమయంలో రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ను తెగ గుర్తు చేసుకుంది. అసలు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో అయినా సరే రేణూ అస్సలు పవన్ ప్రస్తావన్ చేయకుండా ఇంటర్వ్యూ పూర్తి చేయలేదు అనుకో అది వేరే విషయం. కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా రేణూ దేశాయ్ ను అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పింది. ఈ ప్రశ్నలన్నీ ఎక్కవ శాతం పవన్ తో ముడిపడి ఉన్నవే ఉన్నవి.
కాగా రేణూ దేశాయ్ ను తనకు ఇష్టమైన ప్రదేశం ఏంటని అడుగగా మిలాన్ అని టకీమని సమాధానం చెప్పింది. రేణూ దేశాయ్ ఈ విషయంపై మాట్లాడుతూ... బాలు సినిమా షూటింగ్ సమయంలో మిలాన్ లోని ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి దర్శించినట్లుగా వెల్లడించింది. ఇంకా రేణూ మాట్లాడుతూ... తన జీవితంలో ఎంతో త్వరగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్న వాటిలో పెళ్ళి ఒకటి అని, అది తన తొందరపాటు నిర్ణయంగా రేణూ వెల్లడించింది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించగా.. ఒక భర్తగా అయితే పవన్ కు 4-5 మార్కులే వేస్తానంటూ వివరించిన రేణూ.. తండ్రిగా కాని అయితే పదికి వంద మార్కులు వేస్తానంటూ తెలిపింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఇంకా ఫిల్మ్ స్టార్ గా అయితే పదికి పది మార్కులు వేస్తానన్న ఆమె.. పొలీటీషియన్ అయితే పదికి పది మార్కులు వేస్తానంటూ వివరించింది రేణూ దేశాయ్. మొత్తానికి పవన్ నుంచి విడిపోయి రేణూ చాలా కాలం అయినా పవన్ ను మాత్రం మర్చిపోలేక పోతుంది రేణూ దేశాయ్.