Advertisementt

బన్నీ కొత్త జోడి.. బాలీవుడ్ బ్యూటీ!

Mon 06th Mar 2017 06:05 PM
allu arjun,duvvada jagannadham,dj,vakkantham vamsi,kiara advani  బన్నీ కొత్త జోడి.. బాలీవుడ్ బ్యూటీ!
బన్నీ కొత్త జోడి.. బాలీవుడ్ బ్యూటీ!
Advertisement
Ads by CJ

తాజాగా అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథంలో నటించి విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో అటు షూటింగ్, ఇటు ప్రచార కార్యక్రమాల పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా.. దుబాయ్ లో సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టిన చిత్ర యూనిట్ ఏప్రిల్ లో డీజే విడుదల చేసేందుకు మెండుగా అవకాశాలున్నట్లు తెలుస్తుంది.  అయితే డీజే షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రస్తుతం బన్నీ తర్వాత చిత్రానికి సంబంధించిన వ్యవహారాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

ఏప్రియల్ 8వ తేదీ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా... ఆ రోజు బన్నీ ఓ కొత్త సినిమా ప్రారంభించాలన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ఒక పక్క కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్ విషయంలో  కూడా అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. బన్నీ కొత్త సినిమాకు సంబంధించి ఫగ్లీ, ఎంఎస్ ధోనీ చిత్రాలలో నటించిన బాలీవుడ్ భామ కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది. 

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా స్టార్ రైటర్ గా పేరొందిన వక్కంతం వంశీని పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 'నా పేరు సూర్య' అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎటువంటి సమాచారం లేకపోయినా ఇదే ఖాయం కావచ్చన్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కు ట్యాగ్ లైనుగా నా ఇల్లు ఇండియా పెట్టనున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. కాగా  వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ