మంచు మనోజ్ నుండి రాజశేఖర్ వరకు ఇప్పుడు హిట్స్ కోసం ఏదైనా స్పెషల్ అట్రాక్షన్‌ని తమ చిత్రాలలో ఉండాలని భావిస్తున్నారు. సినిమా కథలో దమ్మున్నప్పుడు ఓపెనింగ్స్ కూడా సరిగా తెచ్చుకోలేని తమ ఇమేజ్ ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు జనాలను తెచ్చే ఉపాయాల కోసం ఆలోచన చేస్తున్నారు. అందుకు దగ్గరి దారిగా ఐటమ్‌గర్ల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కాగా పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి వచ్చి, దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోన్న సెక్స్‌బాంబ్ సన్నిలియోన్ అవసరం షారుఖ్ ఖాన్ నుంచి మనోజ్ వరకు ఏర్పడుతోంది. ఇక టాలీవుడ్‌లో మంచు మనోజ్ నటించిన 'కరెంటుతీగ' చిత్రంలో సన్నిలియోన్ కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. కానీ ఈ చిత్రాన్ని విజయవంతం మాత్రం చేయలేకపోయింది. కానీ కింది సీటు ప్రేక్షకులను మాత్రం థియేటర్లకు రప్పించగలిగింది. సినిమా బిజినెస్‌లో, వార్తలో ఉండే విధంగా ఆ చిత్రానికి ప్రచారం కల్పించడంలో ముఖ్యభూమిక పోషించింది. దీని కోసం నిర్మాతలు ఆమెకు భారీ పారితోషికాన్ని ఇవ్వడమే కాదు... తన కుమారుడి కోసం ఇక్కడకు వచ్చినందుకు ఆ సన్నిలియోన్ దంపతులను మోహన్‌బాబు కూడా సన్మానించాడు.
ఇప్పుడు సీనియర్ యాంగ్రీమేన్ రాజశేఖర్ సైతం అదే పార్ములా ఫాలో అవుతున్నాడు. ఎంతో కాలంగా హిట్‌లేని, కనీసం వర్మతో చేసిన 'పట్టపగలు' చిత్రాన్ని రిలీజ్ చేసుకోలేకపోతున్న రాజశేఖర్ దంపతులు ప్రస్తుతం తెరవెనుక ఉండి, తమ బంధువులు చేత రాజశేఖర్‌ను మరోసారి పవర్‌ఫుల్ పోలీస్‌పాత్రలో చూపిస్తూ 'గుంటూరు టాకీస్' దర్శకుడు ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో 'పీఎస్వీ గరుడ వేగ' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ ఐటం పాటకు సన్నిలియోన్‌ను భారీ పారితోషికంతో ఒప్పించారని సమాచారం. కాగా ఈ చిత్రంలో అధికభాగం షూటింగ్‌ను జార్జియాలో చేశారు. రాజశేఖర్ స్థాయికి మించి భారీ బడ్జెట్‌ను పెడుతున్నారు. ఆమధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన 'విశ్వరూపం' ఫేమ్ పూజా కుమార్ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది.