బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన సెక్స్‌వల్‌లైఫ్ గురించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన హోమో సెక్స్‌వల్ అనే వాదన కూడా ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన తన ఆటోబయోగ్రఫీ 'ఏన్ అన్‌సూటబుల్ బోయ్'లో ఆయన వెల్లడించిన విషయాలు కూడా ఈ వాదనను బలపరిచే విధంగానే ఉన్నాయి. కాగా ఆయన తన ఆటోబయోగ్రఫీలోనే తాను త్వరలో తండ్రిని కాబోతున్నానని ప్రకటించాడు. పెళ్లి కాకుండానే ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఫిబ్రవరిలోనే ఆయన సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయినప్పటికీ ఆయన వెంటనే ఈ విషయాన్ని చెప్పకుండా ఇంతకాలం దాచి ఇప్పుడు వెల్లడించాడు. ఇద్దరు పిల్లల బర్త్ సర్టిఫికేట్లలో కూడా ఆయన తండ్రిగా తన పేరును రిజిష్టర్ చేయించాడు. ఆయనకు కవలలుగా ఓ బాబు, ఓ పాప పుట్టారు. ప్రస్తుతం ఆయన తండ్రి అయిన ఆనందంలో తేలియాడుతున్నాడు. ఇక ఈ పిల్లలిద్దరికీ రోహి, యాష్ అనే పేర్లు పెట్టాడు. కానీ ఆయన మాత్రం ఎవరి ద్వారా తనకు పిల్లలు పుట్టారో అన్న విషయాన్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచాడు.
మొత్తానికి తన ఆస్థిపాస్తులకు వారసులను ఆయన తెచ్చుకున్నాడని ఆయన తల్లితో పాటు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం కోసం ప్రమోషన్ల వేగాన్నిపెంచుతున్నాడు. ఇవేగాక ఆయన నిర్మిస్తున్న మరో రెండు బాలీవుడ్ చిత్రాలు కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇక 'బాహుబలి-ది బిగినింగ్'తోపాటు రానా నటించిన 'ఘాజీ' చిత్రాన్ని కూడా ఆయన పంపిణీ చేసి మంచి లాభాలనే అందుకున్నాడు. మొత్తానికి పెళ్లికాకుండానే ఈ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తండ్రి అయ్యాడన్నమాట....! షారుఖ్ పేరు కూడా వినిపించినా..అప్పట్లో దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాలలోని విద్యావంతుల్లో తప్ప మిగిలిన వారికి సరోగసీపై పెద్దగా అవగాహనలేదు. టాలీవుడ్‌లో గతంలో ఎప్పుడు ఈ పదం వినిపించలేదు. కానీ మంచు లక్ష్మి ఈ పద్దతి ద్వారా తల్లి అయిన సందర్భంలో ఆమె తండ్రి మోహన్‌బాబు ఓపెన్‌గా ఈ విషయాన్ని చెప్పాడు. ఇక మంచులక్ష్మి, కరణ్‌జోహార్ వల్ల ప్రస్తుతం సరోగసీ హాట్‌టాపిక్ అయింది.