Advertisementt

చరణ్ స్పీడ్: ఉగాదికి మరో మూవీ..!

Mon 06th Mar 2017 09:26 PM
ram charan,maniratnam,ugadi festival,sukumar,vijaya dasami  చరణ్ స్పీడ్: ఉగాదికి మరో మూవీ..!
చరణ్ స్పీడ్: ఉగాదికి మరో మూవీ..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌.. 'ధృవ' చిత్రం నుంచి తన స్టైల్‌ మార్చాడు. ప్రస్తుతం సుకుమార్‌ చిత్రంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇక సుకుమార్‌ అంటే వైవిధ్యభరితమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే చెప్పాలి. ఎప్పటినుంచో చరణ్‌, క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ విషయంలో చిరు, చరణ్‌లతో మణిరత్నం, సుహాసిని జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చిరు, చరణ్‌ల నుంచి మణికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. దాంతో ఇంకా సుకుమార్‌ చిత్రం పట్టాలెక్కకముందే ఈ చిత్రానికి చరణ్‌ జూన్‌ నుంచి డేట్స్‌ ఇచ్చాడని సమాచారం. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగనుంది. 

గతంలో 'ఆరెంజ్‌' విషయంలో ఇదే ప్రయోగం చేసి సక్సెస్‌ కాలేకపోయిన చరణ్‌ ఈ విషయంలో మణిని పూర్తిగా నమ్ముకుని ఉన్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఉగాదికి విడుదల చేయనున్నారని సమాచారం. మరో పక్క ఈ అవకాశాన్ని ఎలాగైన సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న మణి తాను కార్తి, ఆదితారావ్‌ హైద్రిలతో చేస్తున్న 'చెలియా' చిత్రం విడుదల పనుల్లో ఉంటూనే చరణ్‌కి సంబంధించిన లోకేషన్స్‌ సెలక్షన్‌, ప్రీప్రొడక్షన్‌ పనులను మొదలుపెట్టాడట. మరో విశేషం ఏమిటంటే... 'జంజీర్‌' (తుఫాన్‌)తో బాలీవుడ్‌లో పెద్ద దెబ్బతగిలిన చరణ్‌కు మణి తాజా చిత్రం రెండోచిత్రం కానుందని కూడా వార్తలు వస్తున్నాయి. చరణ్‌ తెలుగుతో పాటు తమిళం, హిందీలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో చేయనున్నాడు. 

కాగా ఈ చిత్రం కథపై ఉన్న నమ్మకంతో ఈ మూడు భాషల్లోనూ ఈ మూవీని మణిరత్నమే తన మద్రాస్‌ టాకీస్‌ సంస్థ ద్వారా నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఇక ఇంతకాలం పట్టాలెక్కని సుకుమార్‌ చిత్రం ఈనెల 20  నుండి రెగ్యూలర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రం పట్టాలెక్కడం లేటయింది. ఇందులోని చరణ్‌ లుక్‌ కోసమే ఈ ఆలస్యం జరిగిందని కొన్ని వార్తలు వస్తుండగా, చైతూతో త్వరలోనే వివాహానికి సిద్దమవుతున్న సమంత ఇందులో నటించే విషయంలోని సందిగ్దం వల్ల లేటయిందనే మరో వాదన వినిపిస్తోంది. గతంలో సమంతను 'ఎవడు, బ్రూస్‌లీ'ల్లో తీసుకోవాలని భావించినా అవి సఫలం కాలేదు. మరి ఈ చిత్రంలోనైనా సమంత ఉంటుందా? లేక మరోసారి అనుపమ పరమేశ్వరన్‌ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంటుందో చూడాల్సివుంది. సుకుమార్‌ మొదటి షెడ్యూల్‌ను భారీ డేట్స్‌తో ఫిక్స్‌ చేశాడట. కాగా ఈ చిత్రాన్ని ఎలాగైనా దసరా పండుగ సీజన్‌లో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ