Advertisementt

కంగనా.. కొత్త గుట్టు బయటపెట్టింది..!

Tue 07th Mar 2017 12:53 PM
kangana ranaut,director roll,jhansi lakshmi bhai  కంగనా.. కొత్త గుట్టు బయటపెట్టింది..!
కంగనా.. కొత్త గుట్టు బయటపెట్టింది..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సుందరాంగి, బాక్సాఫీస్ క్వీన్ కంగనా రనౌత్ కు దేశవ్యాప్తంగా కోట్ల కొలది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించి ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకుందీ ఈ బాలీవుడ్ బ్యూటీ. తన చరిష్మా గల నటనతో బాలీవుడ్ నటీమణులందరికీ సవాల్ విసురుతున్న ఈ భామ తనకున్న సరికొత్త ఆలోచన తాలూకూ గుట్టు విప్పింది. 

కంగనా ఎటువంటి మొహమోహం లేకుండా తను అనుకున్న విషయాన్ని కుండబద్ధలు కొట్టి మరీ వెల్లడించే తత్త్వం కలిగిన నారీమణి. అలా ఇప్పటికే బాలీవుడ్ లోని ప్రముఖులను తన ఆలోచనా విధానంతో చాలామందికి చురకలు అంటించిన విషయం కూడా విదితమే. అయితే తాజాగా తన గురించి వివరిస్తూ.. తనకు ఎప్పటినుండో దర్శకురాలు అవ్వాలని చాలా బలమైన కోరిక ఉండేదని, అది త్వరలోనే నెరవేరుతోందని తెలిపింది ఈ బాలీవుడ్ సుందరాంగి.

అసలే న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుండి ఇప్పటికే స్క్రిప్ట్ రైటర్ గా ట్రైనింగ్ పొందిన కంగనా  ఓ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తానన్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా...రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయ్ చరిత్రను సినిమాగా మలచబోతున్నట్లుగా చెప్పి, ఈ సినిమాకు సంబంధించిన కథను స్వయంగా తానే రూపొందిస్తున్నట్లుగా కూడా వెల్లడించిందీ బాలీవుడ్ క్వీన్.  వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయ్ చరిత్రలో టైటిల్ రోల్ ను కూడా తానే పోషించనున్నట్లు వివరించింది కంగనా రనౌత్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ