బాలకృష్ణ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో ఫుల్ బిజీ. సినిమాల్లో హీరో లాగే నిజ జీవితంలో కూడా హిందూపూర్ కి బాలయ్య ఎమ్యెల్యే అయ్యి హీరో అనిపించుకుందామనుకున్నాడు. అక్కడ ప్రజలను ఉద్ధరించి ఎమ్యెల్యేగా మార్కులు కొట్టేద్దామనుకున్న బాలయ్య కు ఏకంగా ఆయన పిఎ నే షాక్ ఇచ్చి బాలకృష్ణ ని అక్కడ విలన్ ని చేసేశాడు. బాలకృష్ణ పేరుని అడ్డం పెట్టుకుని ఆయన పిఎ శేఖర్ అక్రమంగా ఆస్తులను సంపాదించినట్టు.... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పిఎ శేఖర్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలకృష్ణ పీఏ కారణంగా అనంతపురం జిల్లా టిడిపిలో ముసలం పుట్టింది. అక్కడ బాలయ్య పిఎ శేఖర్ కారణంగా తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఈ విషయాన్నీ నేరుగా తెలుగు తమ్ముళ్లు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇదంతా విన్న చంద్రబాబు అనంతపురం తమ్ముళ్ళని శాంతింప చేసి పిఎ శేఖర్ ని తొలిగిస్తున్నట్లు ప్రకటించాడు.
కానీ పిఎ శేఖర్ మాత్రం హిందూపురంని వదలకుండా అక్కడ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని వార్తలు ప్రచారం జరుగుతున్నవేళ బాలకృష్ణ అనంతపురం టిడిపి కార్యకర్తలతో హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మరీ పిఎ శేఖర్ కార్యకలాపాలపై కన్నేసి ఉంచమని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసాడు. ఇదిలా ఉండగా బాలయ్య పిఎ శేఖర్ స్థానంలో వీరయ్య అనే గణాంకాల శాఖ ఉద్యోగిని బాలకృష్ణ పీఎ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీరయ్యని పిఎ గా అప్పాయింట్మెంట్ చూసాకైనా శేఖర్ ఆ హిందూపూర్ ని వదిలి వెళ్తాడో లేక ఇంకా అక్కడే తిష్ట వేస్తాడో అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.