Advertisementt

బోయపాటి సినిమాలో అత్తగా ఆమె!

Wed 08th Mar 2017 02:32 PM
vaani viswanath,vaani viswanath re entry,vaani viswanath in boyapati film,bellamkonda sai srinivas  బోయపాటి సినిమాలో అత్తగా ఆమె!
బోయపాటి సినిమాలో అత్తగా ఆమె!
Advertisement
Ads by CJ

సినిమా పరిశ్రమలో ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో  ఒకప్పుడు  కథా నాయికలుగా ఓ వెలుగు వెలిగిన నాయికలు ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. అప్పుట్లో అందాలొలికే ముద్దుగుమ్మలుగా దర్శనమిచ్చిన నాయికా మణులు ఆ తర్వాత అత్త‌లుగా, అమ్మ‌లుగా వెండి తెర‌పై సంద‌డి చేయ‌డం ప్రారంభించారు. ఆ జాబితాలో న‌దియా, మ‌ధుబాల‌, రాశీ వంటి పాతత‌రం క‌థానాయిక‌ల్ని మనం మళ్ళీ తెలుగు తెర‌పై చూస్తున్నాం. అయితే తాజాగా ఈ జాబితాలో వాణీ విశ్వ‌నాథ్ చేరిపోయింది. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు కూడాను. కాగా ఈ చిత్రంలో వాణీ విశ్వ‌నాథ్ ఓ కీల‌క పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్..  అల్లుడు శ్రీ‌నుకి అత్త‌గా, ర‌కుల్‌ ప్రీత్ సింగ్ కు అమ్మ‌గా  ఆమె పాత్ర ఉండ‌బోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా ఈ చిత్రంలో ఆమె పాత్ర‌ చాలా విభిన్నంగా ఉంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అన్నట్టు దర్శకుడు బోయపాటి శ్రీను, వాణి విశ్వ‌నాథ్ కు పారితోషికం కూడా బాగానే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది.  

కాగా ఘ‌రానా మొగుడు, కొద‌మ‌సింహం (జపం జపం సాంగ్ లో) వంటి సినిమాలతో వాణీ విశ్వనాథ్ తెలుగులో బాగానే పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసింది. అలా మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం అంతా కలిపి ఓ వంద సినిమాల్లో న‌టించినట్లుగా సమాచారం. ఇంతగా ఏరి కోరి ఈ సినిమాలోకి తెస్తున్న బోయపాటి ఈమెను ఏ విధంగా ఎలివేట్ చేస్తాడో వేచి చూడాలి మరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ