'ఒక లైలా కోసం, గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ప్రేమకథా చిత్రాల దర్శకుడు విజయ్ కుమార్ కొండా పై ఈ రోజు హైద్రాబాద్లో దాడి జరిగింది. అయితే ఈ దాడి కేవలం విజయకుమార్ ఈ మధ్యన చేసుకున్న ప్రేమ వివాహం వల్ల జరిగిందని... విజయ్ చేసుకున్న అమ్మాయి తరుపు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. విజయ్ కుమార్ కొండా ఈ మధ్యనే హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన ప్రసూన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహం రహస్యంగా జరిగిందని తమ కూతురికి మాయమాటలు చెప్పి.... వయసు దాచి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో విజయ్ కుమార్ భార్య.. తల్లితండ్రులు విజయ్ మీద దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి తల్లితండ్రులు విజయ్ ని నానారకాలుగా తిట్టడమే కాకుండా అతనిపై ప్రత్యక్షంగా దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇక విజయ్ కుమార్ కొండా భార్యతో కలిసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తల్లి తండ్రుల మీద కేసు పెట్టి తమకి రక్షణ కల్పించాలని వారిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.