Advertisementt

మహేష్ - మురుగదాస్ మూవీ టైటిల్..?

Wed 08th Mar 2017 07:13 PM
mahesh babu,murugadoss,3 letters title,prince mahesh and murugadoss movie title  మహేష్ - మురుగదాస్ మూవీ టైటిల్..?
మహేష్ - మురుగదాస్ మూవీ టైటిల్..?
Advertisement
Ads by CJ

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ఇంతవరకు టైటిల్ అంటూ ఏమి పెట్టకుండా సస్పెన్సు లో పడేసారు. ఈ చిత్రంలో మహేష్ ఫస్ట్ లుక్ గాని టీజర్ కి సంబంధించిగాని ఏ న్యూస్ కూడా బయటికి రానియ్యకుండా జాగ్రత్తపడుతున్నారు. అసలు మురుగదాస్, మహేష్ లు ఏం ఆలోచిస్తున్నారో గాని ఇక్కడ అభిమానులు మాత్రం మహేష్ కొత్త చిత్రం లుక్ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ కోసం మురుగదాస్ 'సంభవామి' అనే టైటిల్ ని అటు తమిళ్ లో ఇటు తెలుగులో రిజిస్టర్ చేయించినట్లు  వార్తలొచ్చినప్పటికీ అది మహేష్ సినిమాకి సెట్ కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇకపోతే డైరెక్టర్ మురుగదాస్ ఇప్పటివరకు తన సినిమా టైటిల్ కి మూడు, రెండు అక్షరాలకు మించకుండా టైటిల్స్ పెడుతూ వస్తున్నాడు. (ఇప్పటివరకు మురుగదాస్ పెట్టిన టైటిల్స్ లో మచ్చుకు కొన్ని తుపాకీ, గజినీ, స్టాలిన్, రమణ, కత్తి). ఒక్క హిందీ లో తను చేసిన సినిమాకి లేన్తి టైటిల్ పెట్టాడు తప్ప.. తెలుగు, తమిళంలో మాత్రం పొందికగా రెండుమూడక్షరాలతోనే టైటిల్స్ పెట్టి హిట్స్ కొట్టాడు. అయితే మురుగదాస్.. మహేష్ చిత్రానికి ఎలాంటి టైటిల్ అంటే... ఎన్ని అక్షరాల టైటిల్ పెడతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మహేష్ చిత్తానికి వినిపిస్తున్న 'ఏజెంట్ శివ, అభిమన్యు, సంభవామి' వంటి నాలుగు అక్షరాల టైటిల్స్ మురుగదాస్ కి నచ్చుతాయా.? లేకపోతే తన బాణిలోనే తనకు నచ్చిన రెండు, మూడక్షరాల టైటిల్ ని ఎన్నుకుంటాడో? వేచి చూడాలి. 

ఇక ఈ చిత్రంలో మహేష్ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. హేరిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ