Advertisementt

చరణ్- మణిరత్నం మూవీ ఎప్పుడంటే.!

Thu 09th Mar 2017 05:08 PM
ram charan,maniratnam,mani - charan combination movie,june  చరణ్- మణిరత్నం మూవీ ఎప్పుడంటే.!
చరణ్- మణిరత్నం మూవీ ఎప్పుడంటే.!
Advertisement
Ads by CJ

'గీతాంజ‌లి' చిత్రం తర్వాత తెలుగులో డైరెక్టుగా సినిమా చేయలేదు మణిరత్నం. అస్సలు మణిరత్నం అటువంటి ప్రయత్నం కూడా చేయలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మణిరత్నం తీసిన తమిళ సినిమాల్నే తెలుగులో డ‌బ్ చేసుకొని చూసుకున్నామే గానీ డైరెక్టుగా మణిరత్నం తెలుగు తెరపై తీయలేదు. అయితే విషయం ఏంటంటే.. ఈ మధ్య ఏంటో మణిరత్నం తెలుగులో సినిమా చేయాలని తెగ ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఆ మధ్య మ‌హేష్‌బాబుకి ఓ క‌థ చెప్పగా అది వ‌ర్క‌వుట్ కాలేదని తెలుస్తుంది. ఆ తర్వాత నాగార్జునతో సినిమా చేద్దామనుకున్నారు గానీ అదీ కుదరలేదు. ప్రస్తుతం మణిరత్నం, రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చ‌ర‌ణ్ కి కూడా మ‌ణిర‌త్నంతో మూవీ చేయాలని చాలాకాలం నుండి ఆశగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్టు ఓకే అయిపోయిందనే వార్త ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. కాగా పోయిన సంవత్సరం నుండే చ‌ర‌ణ్ – మ‌ణిరత్నం సినిమాపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నా ఎప్పటి నుండి సినిమా ప్రారంభం అవుతుందనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా అందిన సమాచారాన్ని బట్టి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రానికి అధికారికంగా ఓకే అయినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరంలోనే జూన్ లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ప్ర‌స్తుతం రామ్ చరణ్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జులై నాటికి పూర్తవుతుంది. అందుకనే జూన్ లో చరణ్- మణిరత్నం కాంబినేషన్ లో సినిమా లాంఛనంగా ప్రారంభించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ రా ఏజెంట్‌గా దర్శనమివ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. చరణ్ ఇటువంటి త‌ర‌హా పాత్ర తొలిసారిగా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మ‌ణిర‌త్నం చిత్రం అంటే బాలీవుడ్‌లో కూడా బాగా క్రేజేనని అందుకనే ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేయాలని చూస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ