Advertisementt

కాటమరాయుడి గుండెని కాటా వేస్తోంది..!

Thu 09th Mar 2017 09:08 PM
katamarayudu,laage laage song,youtube sensation,pawan kalyan,bhaskarabhatla,anup rubens  కాటమరాయుడి గుండెని కాటా వేస్తోంది..!
కాటమరాయుడి గుండెని కాటా వేస్తోంది..!
Advertisement
Ads by CJ

యూట్యూబ్ ని షేక్ చెయ్యడమే పనిగా పెట్టుకున్న 'కాటమరాయుడు' ఇప్పుడు మరో సాంగ్ తో యూట్యూబ్ పై ధ్వజమెత్తాడు. ఇప్పటివరకు టీజర్ తో మొదటి సాంగ్ తో యూట్యూబ్ సంచలనంగా మారిన 'కాటమరాయుడు' చిత్ర మరో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ని షేకాడిస్తోంది. 'మీరా మీరా మీసం' అంటూ అభిమానులని ఉర్రూతలూగించిన అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇప్పుడు 'లాగే... లాగే ... మనసు లాగే...నీ వైపే నను లాగే....ఊగే మనసు  ఊగే... నీ కోసం తనువూగె....' అంటూ..సాంగ్ తో మళ్ళీ యువతని ఊగించేస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఉన్నక్రేజ్ ఎలాంటిదో ఫస్ట్ లుక్ టీజర్ తోనే చవి చూసింది యూట్యూబ్.... విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ కి కొన్ని లక్షల వ్యూస్, లైక్స్ వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా టీజర్ అంతటి రికార్డు వ్యూస్ ని సాధించించలేదు. 

ఇక ఇప్పుడు శృతి హాసన్ తో డ్యూయెట్ సాంగ్ తో మళ్ళీ యూట్యూబ్ ని షేక్ చేసేస్తున్నాడు పవన్. 'కాటమరాయుడు' సాంగ్స్ ని ఆడియో ఫంక్షన్ లేకుండా సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భాస్కర భట్ల లిరిక్స్ ఇచ్చిన ఈ లాగే లాగే పాట లోని 'కాటమరాయుడి గుండెని ఇట్టా కాటా వేసి పట్టుకుపోయావే..' అనే లిరిక్ ఫ్యాన్స్ కి విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే అనూప్ రూబెన్స్ ట్యూన్స్ కూడా కొత్తగా ఉండటం తో ఆల్బమ్ లో ఈ పాటకి ప్రత్యేక స్థానం లభిస్తుందని, కొంత కాలం పాటు ఈ పాట ప్రేక్షకుల నోట్లో ఆడుతుందని చెప్పవచ్చు. మరి కేవలం పాటలతోనే సినిమాకి విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందోచూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ