Advertisementt

చైతూ టైమ్ స్టార్ట్ అయినట్లుంది..!

Sat 11th Mar 2017 03:29 AM
naga chaitanya,gautham menen,trivikram srinivas  చైతూ టైమ్ స్టార్ట్ అయినట్లుంది..!
చైతూ టైమ్ స్టార్ట్ అయినట్లుంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ‘ఏమాయ చేసావె’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా మాత్రం భారీలోటును మిగిల్చింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఇక సినిమా కష్టం అని కూడా అందరూ భావించారు. కానీ.. ప్రస్తుతం గౌతమ్ మీనన్ నాగచైతన్య తో మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం చైతూ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడట.. నిర్మాత గా  వ్యవహరించనున్నట్లు టాక్ నడుస్తుంది.

అయితే ఉన్నట్టుండి గౌతమ్ మీనన్ నిర్మాతగా మారాడేంటి అనుకోకుండి.. ఎందుకంటే.. ఇంతకు ముందే ఆయన తమిళంలో నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా చేశాడు. ఎంతో వైవిధ్యభరితంగా ఉండే సినిమాలను తీయడంలో గౌతమ్ మీనన్ ముందుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు తెలుగులో విడుదలైన ‘16’ సినిమా తమిళంలో రెండు నెళ్ళ క్రిందటే విడుదలై సంచలన విజయం సొంతం చేసుకుంది.  ఈ చిత్రంతోనే కార్తీక్ నరేన్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు కూడాను. అయితే కార్తీక్ నరేన్ దర్శకత్వ ప్రతిభకు గౌతమ్ ఫిదా అయిపోయినట్లుగా తెలుస్తుంది. అందుకనే  ఇలాంటి చిత్రం తరహాలోనే గౌతమ్ నిర్మాతగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మరో థ్రిల్లర్ ని చేస్తాను అంటున్నాడు గౌతమ్ మీనమ్. ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుందని, ఇందులో నాగచైతన్య, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి కావస్తుండటంతో ఇది అయ్యాక మరో సినిమాను, ఈ సినిమాను ఒకేసారి చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

అంతేకాకుండా తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే నాగచైతన్యతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులలో బిజీగా ఉండగా దసరా నాటికి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన అక్కినేని నాగార్జున నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. అదేంటోగానీ నాగచైతన్య వెనుక ఈ మధ్య ఇంతమంది స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు పడుతున్నారంటే ఏదో జరుగుతుందంటూ ఫిల్మ్ నగర్ టాక్ నడుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ