బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎలాగైనా స్టార్ హీరో గా చెయ్యాలని బాగా బలంగా అనుకుంటున్నాడు. అందుకే మొదటి చిత్రం నుండే స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్ , భారీ బడ్జెట్ అంటూ హడావిడి చేస్తున్నాడు. ఆఖరుకి ఐటెం సాంగ్లో కూడా స్టార్ హీరోయిన్ చేతే స్టెప్పులు వేయిస్తూ శ్రీనివాస్ ని స్టార్ హీరో లెక్కన ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ శ్రీనివాస్ హీరోగా చేసిన రెండు సినిమాలు అతనికి నిరాశే మిగిల్చాయి. మొదటి సినిమాలో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిన సమంతతో జోడి కట్టి మరో స్టార్ హీరోయిన్ తమన్నా తో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన బెల్లంకొండ శ్రీనివాస్ తన రెండో చిత్రంలోనూ సొనారికతో జత కటి మళ్ళీ తమన్నాతో ఐటెంలో ఆడి పాడాడు.
ఇక మూడో చిత్రాన్ని మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో చేస్తున్నాడు. ఈచిత్రంలోను శ్రీనివాస్ ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోనూ మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఐటెంలో ఆడిపాడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ మూడో చిత్రం ఇంకా పూర్తవ్వకముందే శ్రీనివాస్ నాలుగో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్. ఇక ఈ చిత్రానికి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి సురేష్ ని లైన్ లో పెట్టడానికి సురేష్ పావులు కదుపుతున్నాడట.
మరి ఇప్పటిదాకా స్టార్ హీరోయిన్స్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన సురేష్ ఇప్పుడు కీర్తి సురేష్ కి కూడా తన తనయుడి పక్కన నటించడానికి ఎంత భారీ లెవల్లో ఆఫర్ చేస్తాడో అని చెవులు కొరుక్కుంటున్నారు. మరి తన కొడుకు పక్కన స్టార్ హీరోయిన్స్ నటిస్తేనే తన కొడుక్కి పేరు ప్రతిష్టలు వస్తాయా? లేకపోతె అతన్ని ఎవరూ హీరొకింద ట్రీట్ చెయ్యరని భయపడి సురేష్ ఇలా స్టార్ హీరోయిన్స్ కోసం భారీ లెవల్లో డబ్బు ఖర్చుపెడుతున్నాడని టాలీవుడ్ జనాలు అనుకుంటుండటం విశేషం.