Advertisementt

బాలయ్య హీరోయిన్ కోసం పూరి లెక్కలు..!

Sun 12th Mar 2017 05:32 PM
puri jagannadh,balakrishna,heroines,sonakshi sinha,kangana ranaut  బాలయ్య హీరోయిన్ కోసం పూరి లెక్కలు..!
బాలయ్య హీరోయిన్ కోసం పూరి లెక్కలు..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 101 వ చిత్రానికి పూరి హీరోయిన్స్ కోసం, ఇతర టెక్నీషియన్స్ కోసం కాస్టింగ్ కాల్ అంటూ ప్రకటన ఇచ్చాడు. అంటే బాలకృష్ణ ఖచ్చితంగా ఇద్దరు కొత్త హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడని అర్ధమవుతుంది. మరి ఆ కొత్త ముఖాలన్ని పూరి ఏ లాంగ్వేజ్ నుండి తీసుకొస్తాడో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పూరి ఎప్పుడూ బాలీవుడ్ నుండే హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేకపోతె మన తెలుగమ్మాయిలతోనే పని కానిచ్చేస్తాడు. మరి బాలయ్య కోసం పూరి ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ని మైండ్ లో పెట్టుకున్నాడని... వారు సెట్ కాకపోతే ఒక కొత్త మోడల్ ని బాలయ్య చిత్రంతో పరిచయం చెయ్యాలనే ఆలోచనలో పూరి ఉన్నాడనే టాక్ వినబడుతుంది. 

ఇక ఇప్పటికే ముంబై మోడల్ కమ్ నటిని బాలకృష్ణ చిత్రం కోసం ఎంపిక చేశారని త్వరలోనే ఆ డీటెయిల్స్ ని మీడియాకి తెలియజేస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయి పేరును బయటపెట్టకుండా పూరి సీక్రెట్ మెయింటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఇద్దరి ముగ్గురు పేర్లు పూరి మైండ్ సెట్ లో వున్నాయట. అందులో పూరి గత చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్. మరొక  హీరోయిన్ దబాంగ్ భామ సోనాక్షి సిన్హా తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా పూరి లిస్ట్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా కంగనా, సోనాక్షికి రెమ్యునరేషన్ ని భారీగా సమర్పించాలి గనక కొత్త హీరోయిన్స్ ని తీసుకుంటే గనక తక్కువ రెమ్యునరేషన్తో సినిమా తీసోయ్యచ్చనే ప్లాన్ పూరి చేస్తున్నాడని... కేవలం బడ్జెట్ దృష్టిలో పెట్టుకునే పూరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ