హీరోలందరిలో పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒక పక్కన రాజకీయాల్లోకి వెళుతున్నాడని తెలిసినప్పటికీ ఆయనపై ఫ్యాన్స్ కి అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు సరికాదా ఇంకా ఎక్కువవుతోంది. అయన పర్సనల్ లైఫ్ లో ఎలాగున్నా సరే మిగతా విషయాల్లో పర్ఫెక్ట్ అని చెబుతుంటారు. ఇక సినిమాల్లో పవన్ చిత్రం సెట్స్ లో వుందంటేనే ఆ సినిమాకి విపరీతమైన అంచనాలు మొదలైపోతాయి. ఆఖరికి ఆయన సినిమా ప్లాప్ అయినా కూడా పవన్ స్టామినా కు ఉన్న క్రేజ్ అస్సలు తగ్గదు. దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గత చిత్రం 'సర్దార్' ఎంతటి ఘోరమైన ప్లాపో అందరికి తెలుసు. అయినా ఆ ప్లాపు ఛాయలు ఇప్పుడు తాజాగా నటిస్తున్న 'కాటమరాయుడు' బిజినెస్ మీద ఏమాత్రం పడలేదు సరికదా... ఇంకా బిజినెస్ పరంగా పవన్ కళ్యాణ్ స్టామినాని తెలియజేసింది. అసలు 'కాటమరాయుడు' టీజర్ కి యూట్యూబ్ లో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టి మరీ రికార్డ్స్ క్రియేట్ చేశారు.
మరి అంతటి స్టామినాని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కి 'కాటమరాయుడు' చిత్రం తమిళ 'వీరం' కి రీమేక్ అని చెబుతున్నప్పటికీ ఆ సినిమాపై విపరీతమైన క్రేజ్ 'కాటమరాయుడు'కి క్రేజ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు 'కాటమరాయుడు' రికార్డ్స్ ని పక్కన పెట్టి ఈ సినిమాకి పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారట. ఈ సినిమా కోసం నిర్మాతల నుంచి పవన్ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదట. కేవలం నైజాం, ఓవర్సీస్ హక్కులను మాత్రం తన రెమ్యునరేషన్ కింద పవన్ తీసుకుంటున్నాడట. మరి నైజం లో 'కాటమరాయుడు' రైట్స్ ని 25 కోట్ల కి విక్రయించగా... ఓవర్సీస్ హక్కుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయ్యారట. మరి ఈ రెండు ఏరియాల హక్కులని కలిపి 33 కోట్లు వసూలు చేసింది 'కాటమరాయుడు'. అంటే పవన్ తన పారితోషకం కింద దాదాపు 33 కోట్లు అందుకుంటున్నాడన్నమాట.
మరి ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఏ హీరో ఇంతటి పారితోషకం అందుకోలేదు. ఇప్పుడు పవన్ 33 కోట్ల పారితోషకం అందుకుని తనకి ఇక ఏ హీరో నుండి ఎదురు లేదని నిరూపించాడు. అలాగే హై రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ గా పవన్ చరిత్ర సృష్టించాడని అంటున్నారు. ఇదంతా చూస్తున్న పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ అంటే రికార్డ్స్.... రికార్డ్స్ అంటే పవన్ అని గొప్పలకు పోతున్నారు.