Advertisementt

సుచిత్ర కి టాలీవుడ్ సింగర్ సపోర్ట్..!

Mon 13th Mar 2017 08:08 PM
geetha madhuri,singer suchitra,suchi leaks,geetha madhuri support to suchitra  సుచిత్ర కి టాలీవుడ్ సింగర్ సపోర్ట్..!
సుచిత్ర కి టాలీవుడ్ సింగర్ సపోర్ట్..!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ ని. స్టార్స్ ని బీభత్సం గా ఆడుకుని ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్ అయిన సింగర్ సుచిత్ర గురించి రకరకాల కథనాలు వినబడుతున్నాయి. ఆమెకు పిచ్చెక్కిందని, సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతుందని, సైకోలా మారిందని అబ్బో చాలా రోగాలు ఆమెకు అంటగట్టారు. అసలు ఆమె కోలీవుడ్ స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఒక్కొక్కళ్ళ భాగోతాలను బట్టబయలు చేసింది. కోలీవుడ్ లో సుచిత్రకి పరిచయం ఉన్నవారందరిని రోడ్డుకీడ్చింది. వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ని, వీడియోస్ ని లీక్ చేసి వెన్నులో వణుకు పుట్టించింది. ముఖ్యంగా ధనుష్, అనిరుద్ లకైతే చుక్కలు చూపెట్టింది. ఇక త్రిష, ఆండ్రియా, రానా, శింబు, హన్సిక,నయనతార, అమలాపాల్ వంటివారిని బజారుకీడ్చింది. కానీ అవన్నీ సుచిత్ర చెయ్యలేదు ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందని అంటున్నారు.

కానీ ఆమెకు మానసికమైన పిచ్చి ఉందని కొందరు ప్రచారం చేస్తుండగా.. దాన్ని తెలుగు సింగర్ గీతామాధురి కొట్టి పడేసింది. సుచిత్ర అంత బలహీనురాలు కాదని.... డిప్రెషన్ కు లోనయ్యేంత బలహీనమైన అమ్మాయి సుచిత్ర కాదని అంటుంది. సుచిత్ర చాలా టాలెంట్ వున్న సింగర్ అని.... విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెబుతుంది. అలాగే మళ్ళీ ఆమె తన కెరీర్ లో బిజీ అవుతుందని నమ్మకంగా చెబుతుంది. అంటే సుచిత్ర ఆ లీక్స్ అన్ని స్వయంగా చేసిందని.... ఆమె చేసిన ఈ లీక్స్ అన్ని నిజాలేమో అని గీతామాధురి చెబుతున్నట్టేగా...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ