పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తాజాగా వస్తున్న చిత్రం 'రోగ్'. నిర్మాత సిఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. చాలా కాలంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. సినిమాలో అన్నీ కొత్త ముఖాలే కావడంతో సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేసేందుకు పూరీ భారీ స్కెచ్ వేస్తున్నాడని ముందుగానే తెలిపిన విషయం తెలిసిందే. అయితే అన్నట్టుగానే పూరి బాలీవుడ్ ఐటమ్ గార్ల్ సన్నీ లియోన్ ను ఆడియో వేడుకకు దించాడు. మొత్తానికి ఈ ఆడియోకి సన్నీ లియోన్ వచ్చి అలా డ్యాన్స్ చేయడం కూడా అయిపోయింది. అయితే టాలీవుడ్ సినిమాకు ఇలా సన్నీలియోన్ వచ్చి డ్యాన్స్ వేయడం అన్నది ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. అయితే ఈ వేడుకలో సన్నీ లియోన్ డ్యాన్స్ ఎంతవరకు సినిమా ప్రచారానికి సహాయపడుతుందన్నది వేచి చూడాల్సిందే. కానీ సన్నీలియోన్ ను ఆడియో వేడుకకి తెచ్చి చిందులు వేయించడం కంటే 'రోగ్' చిత్రంలోనే ఓ ఐటమ్ సాంగ్ కి సన్నీలియోన్ తో చిందులు తొక్కిస్తే బాగుండేది... అది సినిమా కలెక్షన్స్ కి బాగా ఉపయోగపడేదని కూడా సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కాగా టాలీవుడ్ కి ఈ సినిమా ద్వారా కొత్తగా హీరోగా పరిచయం అయిన ఇషాన్ ను పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు. వారిలో దర్శకుడు క్రిష్, హీరో ఆకాష్, ఇంకా రోషన్, భాస్కరభట్ల వంటి ప్రముఖులు ఇషాన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.