Advertisementt

చైతూ వెళ్తున్న రూట్ బావుంది..!

Tue 14th Mar 2017 04:40 PM
naga chaitanya,different movies,raarandoyi veduka chooddam  చైతూ వెళ్తున్న రూట్ బావుంది..!
చైతూ వెళ్తున్న రూట్ బావుంది..!
Advertisement
Ads by CJ

ఇక ప్రతిసారి సాదాసీదా చిత్రాలు చేసి లాభం లేదని అక్కినేని వారసుడు నాగచైతన్యకి త్వరగానే బోధపడింది. దీంతో రొటీన్‌కు కొంచెం భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే 'ప్రేమమ్‌, సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాల విషయంలో కొత్తరూటును ఫాలోఅయ్యాడు. ఆర్థికంగా పెద్దగా ఆడకపోయినా కూడా నటునిగా మాత్రం చైతూకి ఇవి డిఫరెంట్‌ చిత్రాలే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆయన తన తండ్రి అక్కినేని నాగార్జునకి 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి ఎవర్‌గ్రీన్‌ హిట్‌నిచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. కాగా నాగార్జున 'నిన్నేపెళ్లాడతా' తరహాలో ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఫ్యామిలీ విత్‌ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్‌లోనే ఆ విభిన్నతను చాటిచెప్పాలని యూనిట్‌ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ చిత్రానికి పలు టైటిల్స్‌ను పరిశీలించారు. తాజాగా ఈ చిత్రానికి 'రారండోయ్‌.. వేడుక చూద్దాం' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నాడు. 'సోగ్గాడే చిన్నినాయన'తో పాటు 'సీతారాముల కళ్యాణము చూతమురారండి' వంటి విభిన్న టైటిల్స్‌తో నాగ్‌ చిత్రాలలో నటించడమే కాదు.. కొన్నింటిని నిర్మించాడు కూడా. ఇక చైతూ తాజా చిత్రం టైటిల్‌ కూడా ఎంతో తెలుగుదనంతో నిండివుందని చెప్పవచ్చు. ఇందులో నాగచైతన్యకు జోడీగా స్టార్‌హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత చైతూ... కృష్ణ వైరిముత్తు అనే తమిళ దర్శకునితో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా చైతూ స్ట్రెయిట్‌గా కోలీవుడ్‌ మార్కెట్‌పై కన్నేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ