జనసేన ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భం గా ఆ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జనసేన పార్టీ వెబ్సైట్ ని ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని మీడియాకి తెలియజేసారు. జనసేన పార్టీ ఒకవేళ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ప్రజల కోసం పార్టీ నడిపిస్తానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితం గా జనసేన పోటీ చేస్తుందని.. ఎన్నికల్లో 60 శాతం యువత జనసేన పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగుతారని తెలిపాడు. అంతేకాకుండా తాను జనసేనలో యువ నాయకత్వంకోసం ఎదురు చూస్తున్నానని..... జనసేన పార్టీ జూన్ నుండి తన కార్యా చరణ మొదలు పెడుతుందని తెలిపాడు పవన్. అలాగే పూర్తిగా జనసేన కుదురుకున్నాక ఇతర పార్టీల పొత్తుల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసాడు. పనిలోపనిగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు ప్రభావం లేని రాజకీయనాయకులు ఉండాలని నేను కోరుకుంటున్నాని.... ఏపీ ప్రభుత్వ పథకాలు అనుకున్న రీతిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని తెలిపిన పవన్ కి.. ఒక విలేఖరి మీ అన్నయ్య చిరంజీవి గారు మీ జనసేన పార్టీలోకి వస్తున్నారా అని ప్రశ్నించగా... మా అన్నయ్య చిరంజీవి జనసేనలోకి రారని.. ఆయన ఆలోచనలు తన ఆలోచనలు కలవవు అని పవన్ స్పష్టం చేసాడు.
ఇక పవన్ మాట్లాడిన దాన్ని బట్టి చిరంజీవి ఎప్పటికి జనసేన వైపు చూసే అవకాశాలు లేవని తెలిసిపోతుంది. అలాగే పవన్ తన జనసేన పార్టీ సీట్లను ఎక్కువగా యువతకి కేటాయిస్తానని చెబుతున్నాడు. అంటే పార్టీ టికెట్స్ కోసం ఆశపడే రాజకీయ నేతలకు పవన్ పరోక్షంగా పవన్ నో చెప్పేశాడనే చెప్పాలి.