చిరు కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' లో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ కేథరిన్ ని తీసుకున్నారు. కానీ ఏవో కారణాలతో ఆమె 'ఖైదీ..' ఐటెం సాంగ్ నుండి తప్పుకుంది. కేథరిన్ స్థానంలోకొచ్చిన లక్ష్మి రాయ్ 'ఖైదీ..' ఐటెం సాంగ్ లో బీభత్సం గా రెచ్చిపోయి మంచి పేరు కొట్టేసింది. పాపం కేథరిన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ కేథరిన్ తలపొగరు వల్లే 'ఖైదీ...' ఐటెం ఆమె చేజారిందనే ప్రచారం జరిగింది. ఇక కేథరిన్ ఇక్కడ తెలుగులో అవకాశాలు లేక అక్కడ కోలీవుడ్ లో కాస్త బిజీ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమెకు టాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని ప్రచారం మొదలైంది.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా... శృతి హాసన్ ఐటెంలో నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ ఐటెం సాంగ్ లో డాన్స్ చేసే అవకాశాన్ని కేథరిన్ కొట్టేసిందని అంటున్నారు. ఇక బెల్లంకొండ సురేష్ అయన కొడుకు నటించే చిత్రాల కోసం టాప్ హీరోయిన్స్ నే.. కొడుక్కి జోడిగా సెలక్ట్ చేసుకుని వారికి భారీగా పారితోషకాల్ని ఆఫర్ చేస్తుంటాడని టాక్. అంటే ఈ లెక్కన కేథరిన్, శ్రీనివాస్ చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యడానికి భారీగా రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నారన్నమాట.
ఇక చిరు ఖైదీ... లో ఛాన్స్ మిస్ అయితేనేమిటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో ఐటెం లో కనిపించి బాగా చేతినిండా సంపాదించడానికి కేథరిన్ సిద్ధమైందన్నమాట. మరి కేథరిన్ కి ఇక తెలుగు అవకాశాలు రావన్న వారు ఇప్పుడేం మాట్లాడతారో చూద్దాం.