పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈమధ్య వార్తల్లో నిలబడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోందని అందరికీ బాగానే అర్ధమవుతోంది. జీవితంలో తాను చేసిన తప్పు తొందరపడి పెళ్లి నిర్ణయం తీసుకోవడమేనని చెప్పి ఆమె పవన్ అభిమానుల విమర్శలకు గురైంది. అయినా తనపై విమర్శలు చేసే వారిని ఆమె వదలడం లేదు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? మీరు పవన్‌కి నిజమైన అభిమానులేనా? అని నిలదీసింది. ఇక్కడ మహిళలు, పురుషులు అనే వివక్షతను ఆమె ఎందుకు అస్త్రంగా వాడుకుందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ఇప్పుడు పవన్ ఊపిరి సలపని బిజీలో ఉన్నాడు. సినిమాలు, రాజకీయాలు అనే జోడు సవారీ చేస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా ఆయన చేసే రాజకీయ ప్రక్షాళన ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇంతకాలం పవన్ అంటే కేవలం సినిమా నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు పవన్ ముందు ఎన్నో లక్ష్యాలున్నాయి.
తాజాగా ఆమె మాట్లాడుతూ, తాను రీమేక్ చేయదలిస్తే పవన్ నటించి, దర్శకత్వం వహించిన 'జానీ' విషయాన్ని లేవనెత్తింది. 'ఖుషీ', 'బాలు' వంటి చిత్రాలకు కూడా తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేశానని, నిస్వార్థంగా సేవలందించానని తెలిపింది. ఇక 'జానీ'ని కథానుసారం తీయకుండా అనేక మార్పులు చేర్పులు చేయడం తప్పని, ఈ కథలో హీరో చివరకు చనిపోతాడని, కానీ వాణిజ్య హంగులు అద్డడం కోసం కథను డైల్యూట్ చేశారని చెబుతూనే తాను మరలా అదే కథను మరాఠిలో కమర్షియల్ హంగులు దిద్ది రీమేక్ చేస్తానని తెలిపింది. ఇలా పరస్పరం విరుద్దమైన కామెంట్లు ఎందుకు చేస్తోంది? ఇంతకీ ఆమె చివరి లక్ష్యం ఏమిటి? ఇంకా పవన్ పేరు చెప్పి ఆయన ఫ్యాన్స్‌ను ఎందుకు విసురుకుంటోంది? ఈ విషయంలో పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అనేవి బయటకు వస్తేనే గానీ దీనిపై క్లారిటీ రాదు.