వరుణ్ తేజ్ తో 'కంచె' చిత్రాన్ని తెరకెక్కించి మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన డైరెక్టర్ క్రిష్ త్వరలోనే చిరంజీవి 152 వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది క్రిష్... బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టాడు. అదే ఊపులో ఇప్పుడు చిరుని డైరెక్ట్ చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. మరి 150 వ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్షన్ లో చేసిన చిరు తన 151 వ చిత్రాన్ని 'ధృవ' దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తానని కమిట్ అయ్యాడు. ఇక ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే సినిమాని ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథతో చేస్తారని టాక్ అయితే బాగానే వినబడుతుంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.
మరి ఆ చిత్రం కంప్లీట్ కాగానే చిరు తన 152 వ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్ లో చేస్తాడా? లేకపోతే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తాడో? ఇంకా తెలియాల్సి వుంది. ఎందుకంటే ఇప్పటికే బోయపాటి కూడా చిరంజీవిని కలిసి ఒక పవర్ ఫుల్ కథ వినిపించాడని అది చిరు కి కూడా నచ్చిందనే ప్రచారం ఎప్పుడో జరిగింది. కాకపొతే చిరు - బోయపాటి కాంబో ఉందొ లేదో కూడా ఇంకా తెలియాల్సి వుంది. కానీ క్రిష్ కి మాత్రం 152 వ చిత్రం ఛాన్స్ వచ్చేలా ఉందని ఇన్నర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్న వార్త. ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.