Advertisementt

వీళ్ళని 'మిస్టర్‌' ఏం చేస్తాడో..?

Sat 18th Mar 2017 03:47 PM
mister,varun tej,srinu vaital,mister team  వీళ్ళని 'మిస్టర్‌' ఏం చేస్తాడో..?
వీళ్ళని 'మిస్టర్‌' ఏం చేస్తాడో..?
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న 'మిస్టర్‌' చిత్రం. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూవీ హీరోగా వరుణ్‌తేజ్‌కు, దర్శకునిగా శ్రీనువైట్లకు, నిర్మాతలుగా ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జిలకు కీలకంగా మారింది. మూడేళ్ల కిందటి వరకు శ్రీనువైట్ల అంటే స్టార్‌ డైరెక్టర్‌. ఈ దర్శకుడి దూకుడు చిన్నగా ఉండేది కాదు. కానీ 'ఆగడు'తో పరిస్థితి మారిపోయింది. 'బ్రూస్‌లీ'తో ఆయన పరాజయపరంపర పీక్స్‌కి చేరింది. దీంతో చిన్న హీరోలు కూడా ఆయనకు మొహం చాటేశారు. చివరకు ఆయన వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్‌' చిత్రం చేస్తున్నాడు. 'ఆనందం, సొంతం' చిత్రాల తర్వాత ఆయన తీస్తోన్న లవ్‌ సబ్జెక్ట్‌ ఇది. ఇక మెగాహీరోగా వైవిధ్యాన్ని చాటే ప్రయత్నం చేస్తోన్న వరుణ్‌తేజ్‌కు ఇంకా హీరోగా పెద్దగా బ్రేక్‌రాలేదు. దీంతో 'మిస్టర్‌'తో పాటు శేఖర్‌కమ్ములతో చేస్తున్న 'ఫిదా' చిత్రం ఆయనకు కీలకంగా మారింది. మరోవైపు 'మిస్టర్‌'లో లావణ్యత్రిపాఠి, హెబ్బాపటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్టయితే వీరిద్దరు టాప్‌లీగ్‌లోకి ఎంటర్‌ కావడం ఈజీనే. ఇక నిర్మాతలైన ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జిలకు ఇటీవల మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో భారీ బడ్జెట్‌తో తీసిన 'విన్నర్‌' చిత్రం భారీ నష్టాలను తీసుకొచ్చింది. మరోసారి ఈ 'మిస్టర్‌' చిత్రానికి కూడా ఈ నిర్మాతలు వరుణ్‌తేజ్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ బడ్జెట్‌ను పెడుతున్నారు. ఇలా 'మిస్టర్‌' చిత్రం యూనిట్‌లోని ముఖ్యులందరికీ కీలకంగా మారి, అందరి ఆసక్తిని చూరగొంటోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ