మన దర్శకుల్లో చాలామందికి రెండున్నర గంటల నిడివి ఉండే చిత్రాలను తీయమంటే.. మూడున్నర, నాలుగు గంటల చిత్రాలను తీస్తారు. దీంతో నిర్మాతలకు బాగా నష్టం. కానీ ఇది నిన్నటిమాట. నేడు దానిని కూడా మన మేకర్స్ సరికొత్త యాపార సూత్రంగా భావిస్తున్నారు. లెంగ్త్ ఎక్కువైన సీన్స్‌ను ఎడిటింగ్‌లో లేపేస్తారు. కానీ ఈ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే రిపీట్ ఆడియన్స్ కోసం ఆ సీన్స్‌ను, కామెడీ ట్రాక్‌లను, పాటలను, ఫైట్స్‌ను యాడ్ చేస్తారు. ఇక ఆ చిత్రం అప్పటికే థియేటర్ల నుండి లేపేసి ఉంటే, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో వాటిని పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు. చిరంజీవి, మహేష్‌ల నుంచి రామ్ వరకు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు.
'నేను.. శైలజ' చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత ఎడిట్ చేసిన కొన్ని సీన్స్ కలిపారు. మహేష్, వెంకటేష్‌ల మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఘనవిజయం సాధించిన తర్వాత అందులో తీసివేసిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్ వదిలారు. ఇక 'టెంపర్' చిత్రంలో పూరీ-ఎన్టీఆర్‌లు అదే పనిచేశారు. ఇక కొరటాల శివకైతే ఇది ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' చిత్రాలకు ఆయన ఇదే ఫాలో అయ్యాడు. తాజాగా చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్150'లోని డిలేటెడ్‌సీన్స్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తూ, నిర్మాత చరణ్‌కి బాగానే సంపాదన లభించేలా చేస్తున్నాయి. సో.. నేడు టాలీవుడ్‌లో దీనిని నయా ట్రెండ్‌గా చెప్పాలి.