Advertisementt

MEK..... చిరు పరువు తీస్తోందా..?

Mon 20th Mar 2017 08:42 PM
mek,chiranjeevi,trp ratings,meelo evaru kotiswarudu  MEK..... చిరు పరువు తీస్తోందా..?
MEK..... చిరు పరువు తీస్తోందా..?
Advertisement
Ads by CJ

ఈ మధ్యన ఎక్కడ చూసినా చిరు బుల్లితెర షో మీలో ఎవరు కోటీశ్వరుడు పెద్ద ప్లాప్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆయన వెండితెర మీద మాత్రమే హీరో ఇక్కడ బుల్లితెర మీద మాత్రం జీరో అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. డెక్కన్ క్రానికల్ చిరంజీవి టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు పెద్ద ఫ్లాప్ అయిందంటూ ఒక పెద్ద కథనమే ప్రచురించింది. నాగార్జున హోస్ట్ గా చేసినప్పుడే ఈ షో కి మంచి రేటింగ్ వచ్చిందని.. ఇప్పుడు చిరు వచ్చాక ఆ రేటింగ్ పూర్తిగా పడిపోయిందని చిరు తో ఆ షో నిర్వహిస్తున్న ఆ ఛానెల్... ఏదో అనుకుంటే ఏదో అయ్యిందని రాసేసింది.

నాగార్జునతో ఆ షో చేస్తున్నంత సేపు ఎంతో కొత్తగా ఉండేదని... చిరు వచ్చాక ఆ కొత్తదనం పోయి మరీ  రొటీన్ గా తయారయ్యిందని... అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు పూర్తిగా బోర్ కొట్టేస్తుందని అంటున్నారు. అయితే ఈ షో ఇంత ఘోరంగా ప్లాప్ అవ్వడానికి కారణాలను వెతికే పనిలో ఉన్న ఆ ఛానెల్ వారికీ దొరికిన కారణాలు ఏమిటంటే.... మొట్టమొదటగా ఈ షో ని పరీక్షల సమయంలో మొదలు పెట్టడం వలన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ షో గురించి పట్టించుకునే తీరిక లేకపోవడం ఈ షో బ్యాడ్ టైం గా ఆ ఛానెల్ వర్గాలు చెబుతున్నాయట. మరొక కారణం ఈ షో నాగ్ ఉన్నప్పుడు రాత్రి 9  కి మొదలైతే చిరు వచ్చాక అది 9 .30 కి మొదలుపెట్టడం కూడా ఈ షో రేటింగ్ పడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు.

ఇకపోతే ఇప్పుడు ఏప్రిల్ నుండి ఐపీఎల్ మొదలు కావడంతో ఈ షో కి రేటింగ్స్ పెరిగే అవకాశం ఇక లేదని ఛానెల్ ప్రతినిధులు కూడా ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. పాపం చిరంజీవి ఈ మీలో ఎవరు కోటీశ్వరుణ్ణి ఏ టైమ్ లో మొదలెట్టాడో గానీ.. మొదలు పెట్టినప్పటినుండి ఈ షో పై అన్ని నెగెటివ్ వార్తలే ప్రచారమవడం గమనార్హం. అందుకే ఈ షో నుండి ఎంత త్వరగా చిరు తప్పుకుంటే అంతమంచిది లేకుంటే పరువుపోతుందే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ