కోలీవుడ్ లో విశాల్ - వరలక్ష్మి ప్రేమాయణం గురించి అందరికి బహిరంగంగా తెలిసిన విషయమే. అయితే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి.. విశాల్ తో వరలక్ష్మి తిరగడం ఇష్టం లేక, వరలక్ష్మి ని చాలా సార్లే హెచ్చరించాడు. ఇక విశాల్ తో అయితే ప్రతి ఒక్క విషయాన్ని విభేదించేవాడు. అలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విశాల్ కి, వరలక్ష్మి కి మధ్యన ఏవో విభేదాలు వచ్చి వారి లవ్ బ్రేకప్ అయ్యిందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది.
అయితే తాజాగా ఈ జంట ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతూ ప్రైడ్ అఫ్ తమిళనాడు అవార్డు ఫంక్షన్ లో కనిపించారు. ఇక ఈ అవార్డు ఫంక్షన్ లో వీరిరువురు చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ముచ్చటించుకోవడం మీడియా క్లిక్ మనిపించింది. ఈ ఫంక్షన్ లో విశాల్.. వరలక్ష్మి జంటే హైలెట్. ఇక వీరిద్దరూ బ్రేకప్ కి బై బై చెప్పేసి మళ్ళీ ఒక్కటైపోయారని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచారం చేస్తుంది.
మరి వీరిద్దరూ విడిపోయారని సంతోషంగా వున్న వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మళ్ళీ వీళ్ళని ఇలా చూసి ఎలా ఫీలవుతున్నాడో అని కోలీవుడ్ జనాలు ముచ్చటించుకుంటున్నారు.