పవన్ కళ్యాణ్ తన భార్య రేణు దేశాయ్ తో విడిపోయి విడాకులు తీసుకున్నప్పటికీ.... ఆయన తన కొడుకు అకీరా ని, ఆరాధ్యని ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకు చాలానే ఉదాహరణలు వున్నాయి. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణే కి మకాం మార్చింది. అయినా కూడా పవన్ పిల్లల దగ్గరికి వెళ్లి వస్తుండేవాడు. ఇక రేణు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ ని ఆకాశానికెత్తేస్తూ పవన్ నామస్మరణే చేస్తుంటుంది.
పవన్ కళ్యాణ్ తన పిల్లల పుట్టినరోజులు వారి దగ్గరికి వెళుతూ వారికీ ఆనందాన్ని పంచుతుంటాడు. ఇప్పుడు కూడా పవన్ తన కూతురు ఆరాధ్య పుట్టిన రోజు సందర్భంగా.. గురువారం పూణే వెళ్లి తన కూతురు ఆరాధ్యని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అక్కడ ఆరాధ్య తో కేక్ కట్ చేయించి మరీ పవన్ తన సంతోషాన్ని వారితో పంచుకున్నాడు.