Advertisementt

ఎన్టీఆర్‌ చిత్రం 'మనం' తరహా మూవీనా!

Sat 25th Mar 2017 02:32 PM
jr ntr,jai lava kusa,manam type movie,hari krishna  ఎన్టీఆర్‌ చిత్రం 'మనం' తరహా మూవీనా!
ఎన్టీఆర్‌ చిత్రం 'మనం' తరహా మూవీనా!
Advertisement
Ads by CJ

'మనం' చిత్రం తెలుగులో ఓ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ఈ తరహాలోనే పలు సినీ ప్రముఖులు తమ ఫ్యామిలీ చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం చేసింది. ఇక మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌లు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ ఫ్యామిలీ చిత్రాలతో తమ అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనున్నారు. 

కాగా గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్‌, బాలకృష్ణ, హరికృష్ణలతో కలిసి నటించాడు. ఇక కృష్ణ కూడా రమేష్‌బాబు, మహేష్‌లతో కలిసి నటించాడు. ఇక ప్రస్తుతానికి వస్తే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఆయన అన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. 100కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. 

తాజాగా లీక్‌ అయిన ఓ ఫోటోలో యంగ్‌టైగర్‌ టేబుల్‌ మీద ఉన్న నేమ్‌ ప్లేట్‌లో లవకుమార్‌ అనే పేరు స్సష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ కూడా కనిపించాడు. దాంతో ఈ చిత్రంపై మరిన్ని కథనాలు వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో పాటు తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్‌రామ్‌లు కూడా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే యంగ్‌టైగర్‌కి ఇది ఫ్యామిలీ చిత్రంగా ఆయన అభిమానులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ