Advertisementt

అజిత్‌ లుక్ అదిరింది..మరి పవన్..!

Sat 25th Mar 2017 03:04 PM
ajith,vivegam,pawan kalyan,six pack  అజిత్‌ లుక్ అదిరింది..మరి పవన్..!
అజిత్‌ లుక్ అదిరింది..మరి పవన్..!
Advertisement
Ads by CJ

అజిత్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన శివ దర్శకత్వంలో ఇప్పటికే 'వీరం, వేదాలం' వంటి రెండు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు హ్యాట్రిక్‌ మూవీగా 'వివేగం' చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో అజిత్‌ సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాడు. ఇక తాజాగా విడుదలైన స్టిల్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మంచుకొండల్లో గన్‌ పట్టుకొని ఉన్న అజిత్‌ స్టిల్‌ కేకపుట్టిస్తోంది. కాగా ఇందులో ఆయన ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. నేరస్తులను పట్టుకునేందుకు వివిధ దేశాలు తిరిగే ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండటంతో చిత్ర కథానుసారం ఈ మూవీ షూటింగ్‌ను ఇప్పటి వరకు ఇండియన్‌ హిస్టరీలో తీయనన్ని దేశాలలో చిత్రకరించారు. దీంతో బడ్జెట్‌ కూడా భారీగానే అయింది. 

ఈ మూవీ అజిత్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రం విడుదల కోసం అజిత్‌ అభిమానులే కాదు.. అందరు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పవన్‌ ఇప్పటికే 'వీరం'ని 'కాటమరాయుడు'గా రీమేక్‌ చేశాడు. కానీ ఇది సడన్‌గా తీసుకున్న నిర్ణయం కావడంతో 'వీరం'ని తెలుగు డబ్బింగ్‌ కూడా చేసేశారు. కానీ 'వేదాలం, వివేగం' విషయంలో మాత్రం మన తెలుగు నిర్మాతలు బాగా ఆలోచిస్తున్నారు. వీటిని తెలుగులోకి డబ్‌ చేయకుండా పవన్‌ ఒప్పుకుంటే ఆయనతోనే ఈ చిత్రాలను రీమేక్‌ చేయాలని ఎ.యం.రత్నం వంటి వారు ఆలోచనలో ఉన్నారు. 'వివేగం' కనుక హిట్టయితే పవన్‌ కూడా ఈ చిత్రం రీమేక్‌పై ఆసక్తి చూపించవచ్చని సమాచారం. మరి ఈ చిత్రం రీమేక్‌ చేస్తే పవన్‌ కూడా అజిత్‌లా సిక్స్‌ప్యాక్‌ను తొలిసారి చేస్తాడా? లేదా? అనే విషయం పలువురు చర్చించుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ