Advertisementt

చిరుతో పోటీ పడుతున్న చిన్న చిత్రాలు!

Sat 25th Mar 2017 07:16 PM
chiranjeevi,national award category,shatamanam bhavati,khaidi no 150,pelli choopulu,manalo okadu  చిరుతో పోటీ పడుతున్న చిన్న చిత్రాలు!
చిరుతో పోటీ పడుతున్న చిన్న చిత్రాలు!
Advertisement
Ads by CJ

త్వరలో ప్రకటించనున్న జాతీయ ఉత్తమ చిత్రాల కేటగరీలో తెలుగు నుంచి 16 చిత్రాలను పంపారు. కానీ ఎట్టకేలకు నాలుగు చిత్రాలు మాత్రం తుది రేసులో ఉన్నాయి. చిరు నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం రీమేక్‌ కావడంతో ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రం కేటగిరీలో కాకుండా మిగిలిన విభాగాలల్లో పోటీకి నిర్ణయించారు. కాబట్టి ఏదో ఒక విభాగంలో ఈ చిత్రానికి జాతీయ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో చిరు పావులు కదుపుతున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇక ఉత్తమ చిత్రం కేటగిరీకి మరో మూడు చిన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. దిల్‌రాజు నిర్మాణంలో సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన 'శతమానంభవతి', విజయ్‌ దేవరకొండ, రీతూవర్మలు జోడీగా తరుణ్‌భాస్కర్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిన్న చిత్రం 'పెళ్లిచూపులు' కూడా పోటీలో ఉంది. ఈ చిత్రం సంచలన విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఇక సందేశాత్మక చిత్రాలనే తీస్తోన్న సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ 'మనలో ఒకడు' చిత్రం కూడా పోటీలో ఉంది. ఇక ఖైదీని తప్పించి మిగిలిన మూడు చిత్రాలలో ఏది ఉత్తమ కథా చిత్రంగా నిలుస్తుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ